టూత్ బ్రష్: ఎన్ని రోజులకోసారి మార్చాలి?

Purushottham Vinay
ఒకే టూత్ బ్రష్ ను ఎక్కువ కాలం పాటు ఉపయోగించడం వల్ల బ్రష్ లో బ్యాక్టీరియా అనేది బాగా పెరిగిపోతుంది. ఇక దీని వల్ల దంతక్షయం బారిన పడొచ్చు. అందుకే టూత్ బ్రష్ లను ఎప్పటికప్పుడు కూడా మారుస్తూ ఉండాలి. అందులోనూ ఎక్కువ కాలం ఒకే బ్రష్ తో దంతాలను తోమడం వల్ల దంతాలు అనేవి పూర్తిగా క్లీన్ కావు. అందుకే బ్రష్ ను ఖచ్చితంగా తప్పని సరిగా మార్చాలి.ఇంకా జ్వరం లేదా ఇతర అనారోగ్య సమస్యల నుంచి కోలుకున్న తర్వాత బ్రష్ లను ఖచ్చితంగా మార్చాలి. ఎందుకంటే జ్వరం ఉన్నప్పుడు పళ్లు తోముకున్నప్పుడు బ్యాక్టీరియా బ్రష్ కు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక దీనివల్ల మీరు మళ్లీ అనారోగ్యం బారిన పడొచ్చు. అందుకే అలాంటప్పుడు ఖచ్చితంగా బ్రష్ ను మార్చండి.


ఇంకా అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే హార్డ్ గా ఉండే బ్రష్ లను ఉపయోగించడం ఖచ్చితంగా మానేయండి. ఎందుకంటే ఇవి దంతాలను దెబ్బతీస్తాయి. అందుకే స్మూత్ గా ఉండే త్రెడ్ బ్రష్ ను మాత్రమే ఉపయోగించండి. ఇవి మీ దంతాలను దెబ్బతినకుండా చూస్తాయి.ప్రతి ఒక్కరూ కూడా తమ తమ టూత్ బ్రష్ లను 3 నుంచి 4 నెలలకోసారి ఖచ్చితంగా మార్చాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ మీరు అనారోగ్య సమస్యను ఫేస్ చేస్తున్నట్టైతే ఈ సమయం కంటే ముందుగానే బ్రష్ ను చేంజ్ చేయాలి. brush bristles కనుక పాడైతే దంతాలు అసలు పూర్తిగా క్లీన్ కావు. దానితోనే దంతాలను క్లీన్ చేయడం వల్ల పంటినొప్పి కూడా చాలా ఎక్కువగా కలుగుతుంది. ఎందుకంటే పిల్లల కంటే పెద్దలే చాలా కఠినంగా బ్రష్ చేస్తారు.మీరు ఏ రకమైన బ్రష్ ను ఉపయోగించినా కూడా దానిని మాత్రం శుభ్రంగా ఉంచుకోవాలి.ఇక అమెరికన్ డెంటల్ అసోసియేషన్ సూచించిన ప్రకారం.. బ్రష్ ను ఉపయోగించిన తర్వాత ఇక దాన్ని బాగా కడగాలి. ఆ తర్వాత బ్రష్ ను ఖచ్చితంగా నిటారుగా పెట్టాలి. ఇక ఇలా పెట్టడం వల్ల అది తొందరగా ఆరుతుంది. తేమ కూడా వెంటనే పోతుంది. ఇక మాయిశ్చరైజ్డ్ టూత్ బ్రష్ లను క్లోజ్డ్ కంటైనర్ లో పెడితే.. వాటిపై సూక్ష్మజీవులు అనేవి జీవిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: