కొర్రలు: ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

Purushottham Vinay
కొర్రలు తీపి ఇంకా వగరు రుచిని కలిగి ఉంటాయి.కడపునొప్పి, మూత్రంలో మంట, ఆకలి లేకపోవడం ఇంకా అతిసారం వంటి సమస్యలకు కొర్రలు చక్కని పరిష్కారం చూపిస్తాయి. వీటిని నిత్యం తినడం ద్వారా అధిక బరువును ఈజీగా తగ్గించుకోవచ్చు. వీటిలో యాంటీ యాక్సిడెంట్లు అనేవి అధికంగా ఉంటాయి. పీచు పదార్ధం అధికంగా వుండటం వలన మలబద్దకాన్ని కూడా ఈజీగా అరికడుతుంది. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో జ్వరం వచ్చినపుడు కొర్ర గంజి తాగితే జ్వరం తగ్గిపోతుంది. గుండెజబ్బులు, రక్తహీనత, ఉబకాయం, కీళ్ళవాతం, రక్తస్రావం ఇంకా అలాగే కాలిన గాయాలు త్వరగా తగ్గటానికి కొర్రలు తినడం మంచిది.ఇంకా అలాగే అల్జీమర్స్ ను కూడా తగ్గించి ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచటంలో తోడ్పడతాయి. ఇక నాడీవ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపే మోరెల్ విటమిన్ వీటిలో లభిస్తుంది. బెల్స్ పాల్సీ ఇంకా మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఎంతగానో సహాయపడుతుంది. చిన్నపిల్లలకు ఇంకా గర్భిణిలకు మంచి ఆహారం. అలాగే ఉదర సంబంధ వ్యాధులకు కొర్రలు తినడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. మాంసకృతులు ఇంకా ఇనుము అధికంగా ఉండటం వలన రక్తహీనత నివారణకు చక్కటి ఔషధం. కొర్రల్లో మాంసకృత్తులు ఇంకా ఐరన్ శాతం ఎక్కువుగా ఉండటం వలన రక్తహీనతను చాలా ఈజీగా తగ్గిస్తుంది.


వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి జీర్ణశక్తిని కూడా బాగా పెంచుతాయి.ఇంకా రక్తాన్ని కూడా వృద్దిచేస్తుంది.ఈ కొర్రలు శరీరానికి అమితమైన పుష్టినిస్తాయి. ఇంకా నడుముకు మంచి శక్తిని ఇస్తాయి.నిద్రలో పక్కలో మూత్రవిసర్జన చేసే పిల్లలకు కొర్రలు తినిపిస్తే మూత్రాశయ నియంత్రణ బాగా మెరుగుపడి ఆ ఇబ్బంది నుండి బయట పడతారు.ఊపిరితిత్తులకు సంభవించే ఇన్ఫెక్షన్లను, న్యుమోనియాను ఇంకా మధుమేహ రోగులు బాధపడే అరికాళ్ళ మంటలను ఇంకా స్పర్శ కోల్పోవడం వంటి పరిస్థితులను నయం చేస్తాయి. ఇంకా అలాగే నాడీ వ్యవస్థ పనితీరు సజావుగా సాగడానికి వీటిలోని ప్రోటీన్ బాగా సహాయపడుతుంది. కొర్రలను రెగ్యులర్‌గా తినడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా కూడా కాపాడుతుంది. అదేవిధంగా వీటిని నిత్యం తినేవారిలో కీళ్ల నొప్పులు ఇంకా మతిమరుపు కనిపించవు. నరాల సంబంధమైన బలహీనతలకు సరైన ఆహరం కొర్ర బియ్యంగా ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని రకాల చర్మ రోగాలను పారదోలేందుకు, నోటి కాన్సర్, ఉపిరితిత్తుల కాన్సర్, ఉదర కాన్సర్, పార్కిన్సన్ రోగం ఇంకా అలాగే ఆస్తమా నివారించడంలో సైతం కొర్ర బియ్యం తోడ్పడుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: