మధుమేహం వల్ల వచ్చే నొప్పులు తగ్గాలంటే ఎలా?

Purushottham Vinay
మధుమేహం అనేది అత్యంత ప్రమాదకరవ్యాధి. దీనికి కేవలం నియంత్రణే తప్పు పరిష్కారం పూర్తిగా లేదు.డయాబెటిస్ కారణంగా శరీరంలోని వివిధ భాగాల్లో అనేక రకాల మార్పులు వస్తుంటాయి.ఇంకా దేశంలో డయాబెటిస్ అనేది చాపకిందనీరులా విస్తరిస్తోంది. ప్రతి పదిమందిలో ఒకరికి ఉన్నా కూడా ఆశ్చర్యం లేదంటున్నారు వైద్య నిపుణులు. చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆందోళన ఇంకా లైఫ్‌స్టైల్ కారణంగా ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంటుంది. దీనికి పూర్తి చికిత్స లేదు కాబట్టి..దీన్ని ఎప్పటికప్పుడు నియంత్రణలో ఉంచుకోవాలి. మీకు బ్లడ్ షుగర్ లెవెల్ నియంత్రణలో లేకపోతే వివిధ రకాల సమస్యలు ఎదురౌతాయి.ఇక బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగితే..చేతులు ఇంకా కాళ్లలో తరచూ నొప్పులు వస్తుంటాయి. మీకు కూడా చేతుల నొప్పి సమస్య ఉంటే ఖచ్చితంగా బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవడం మంచిది.డయాబెటిస్ రోగుల్లో నొప్పులకు ఏం చేయాలో తెలుసుకుందాం..మధుమేహం వల్ల మీకు చేతులు కాళ్ళు నొప్పుల సమస్య తీవ్రంగా ఉంటుంది.


ఈ పరిస్థితుల్లో స్ట్రెచింగ్ చేయడం అనేది మంచి ప్రత్యామ్నాయం. దీనివల్ల మాంసకృతుల్లో రిలాక్సేషన్ అనేది వస్తుంది. స్ట్రెచింగ్ చేయడం వల్ల కాళ్ల నొప్పుల్నించి మీరు ఉపశమనం పొందవచ్చు. ఇక మరో విధానం వచ్చేసి కోల్డ్ థెరపీ. డయాబెటిస్ రోగుల్లో కన్పించే చేతి నొప్పుల్నించి మంచి ఉపశమనం పొందేందుకు కోల్ట్ థెరపీ చేయాలి. దీనికోసం దాదాపు 10 నుంచి 15 నిమిషాలు ఐస్ ముక్కల్ని ఓ వస్త్రంలో చుట్టి నొప్పి ఉన్న చోట కాపడం పెట్టాలి. దాని ఫలితంగా నొప్పి నుంచి రిలీఫ్ లభిస్తుంది.చేతులు ఇంకా కాళ్ల నొప్పి సమస్యల్ని తగ్గించేందుకు ఎప్పుడూ హెల్తీ డైట్ ఎంచుకోవాలి. మరోవైపు ధూమపానం ఇంకా మద్యం నుంచి దూరంగా ఉండాలి.అలాగే కీళ్ల నొప్పుల్నించి ఉపశమనం పొందేందుకు ఏరోబిక్స్ అలవాటు చేసుకుంటే చాలా మంచి ఫలితాలుంటాయి. ఇక డయాబెటిస్ కారణంగా నొప్పులుంటే మాత్రం ఇదే మంచి ప్రత్యామ్నాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: