పానీపూరి : తింటే రోగాలు తప్పవు?

Purushottham Vinay
ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు అంతుచిక్కని రోగాలు మనుషులను చాలా ఎక్కువగా వేధిస్తుంటాయి. ఈ సీజన్‌లో ముఖ్యంగా టైఫాయిడ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అనే చెప్పాలి.ఇంకా అలాగే చాలా రాష్ట్రాల్లో కూడా ఈ టైఫాయిడ్ కేసులు చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర వైద్యాధికారులు కీలక ప్రకటన చేయడం జరిగింది. ఇక ఈ టైఫాయిడ్ కేసుల భారీ పెరుగుదలకు పానీపూరి కారణం అని ప్రకటించారు.ముఖ్యంగా అందులో వాడే పదార్థాలు టైఫాయిడ్ వంటి రోగాలకు దారి తీస్తుందని కూడా వైద్యులు చెబుతున్నారు. ఇక అంతేకాదు.. టైఫాయిడ్‌కు పానీపూరి వ్యాధిగా పేరు పెట్టి ప్రజల్లో అవగాహన కూడా కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పానీపూరి వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇవాళ మనం పూర్తిగా తెలుసుకుందాం.ఇక ఈ పానీపూరి ఎక్కువగా తినడం వల్ల శరీరంలో టైఫాయిడ్ మాత్రమే కాదు అనేక రకాల సమస్యలు చాలా ఈజీగా వస్తాయి. 


అందుకే వర్షాకాలంలో అసలు ఈ పానీపూరి తినొద్దని వైద్యులు సూచిస్తున్నారు.ఇంకా అలాగే పానీపూరి ఎక్కువగా తినడం వల్ల అతిసారం సమస్య కూడా చాలా ఎక్కువగా వస్తుంది.ఇంకా అలాగే ఈ పానీపూరి ఎక్కువగా తినడం వల్ల డీహైడ్రేషన్ సమస్య కూడా ఎక్కువగా వస్తుంది.అలాగే వాంతులు, విరేచనాలు ఇంకా కామెర్లు వచ్చే అవకాశం ఉంది.ఈ పానీ పూరీ వల్ల అల్సర్లు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది.అలాగే ఎక్కువ పానీపూరి నీరు వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువగా వస్తాయి. వీటిని తినడం వల్ల ప్రేగులలో ఎక్కువ మంటలు వస్తాయి.మరీ ముఖ్యంగా వర్షాకాలంలో పానీపూరి తినకుండా ఉండటం చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.కాబట్టి పానీపూరి తినడం మానేయండి. జాగ్రత్తగా సంపూర్ణ ఆరోగ్యంగా ఎలాంటి రోగాలు దరి చేరకుండా తినండి. పానీపూరికి బదులు ఏమైన పండ్లు తినడం అలవాటు చేసుకోండి.ఎందుకంటే ఆ పానీపూరి అమ్మేవారు కూడా పరి శుభ్రంగా వుండరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: