బరువుని ఇలా ఈజీగా తగ్గించుకోవచ్చు?

Purushottham Vinay
పెరిగిన బరువు ఇంకా అలాగే కొవ్వుని అసలు ఎవరూ కూడా ఇష్టపడరు. ఫిట్‌గా ఇంకా అలాగే ఆరోగ్యంగా కనిపించాలనేది ప్రతి ఒక్కరి కోరిక. కానీ ఇది కొంచెం కష్టమైనదని చెప్పాలి.ఎందుకంటే ఇక దీనికోసం ఖచ్చితంగా కొంత శ్రమించాల్సి ఉంటుంది. అయితే అధిక బరువు సమస్యని తగ్గించుకోవడానికి ఇక్కడ మరోక విధానం కూడా ఉంది. ఇక అదేంటంటే ఆహారంపై నిఘా ఉంచడం. కొవ్వును పెంచే ఆహారాలకి దూరంగా ఉండటం చాలా మంచిది. ఇక వీటి గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం.ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా 8 గంటలు నిద్రపోవాలి. ఎందుకంటే దీని కంటే తక్కువ నిద్రపోవడం వల్ల మీ శరీరంలో కొలస్ట్రాల్‌ అనేది చాలా అధికమవుతుంది. తీపి కోరికలను అణచివేయడానికి స్వీట్లు లేదా చక్కెరకు బదులుగా ఎక్కువగా పండ్లు తినండి. ఇలా చేయడం వల్ల సహజ చక్కెర మీ శరీరంలో కి చేరుతుంది. అంతేకాదు తీపి తినాలానే కోరికలు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి.ఇంకా కొవ్వు పెరిగే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయి. అతిగా తినే అలవాటు కూడా చాలా ప్రమాదం.


ఫాస్ట్ ఫుడ్, మైదా ఇంకా అలాగే స్వీట్లతో చేసిన ఆహారాలు చూసి కూడా తినకుండా ఉండే విధంగా అలవాటు చేసుకోవాలి. మిమ్మల్ని మీరే కొన్ని ప్రశ్నలు వేసుకోవాలి.ఇంకా అలాగే ప్లేట్‌లో ఉన్న ఆహారం తినేముందు దానివల్ల మీ శరీరానికి ఎంత పోషకాహారం లభిస్తుంది. ఎంత కొవ్వు ఇంకా ఎన్ని కేలరీలు లభిస్తాయి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు ఈ ప్రశ్న అడగడం ప్రారంభించిన వెంటనే మీ శరీరం కోరికలను ఇక అదుపుచేసుకుంటుంది. శరీరంలో ఇందుకు సంబంధించిన హార్మోన్లు కూడా చాలా ఈజీగా విడుదలవుతాయి. అప్పుడు మీరు అదనపు కొవ్వు ఇంకా అలాగే కేలరీలను కూడా తీసుకోకుండా ఉంటారు. ఇక అంతేకాదు మీ బరువు కూడా అదుపులో ఉంటుంది.కాబట్టి ఖచ్చితంగా పైన చెప్పిన టిప్స్ ని పాటించండి. ఈజీగా బరువుని తగ్గించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: