బరువు పెరగాలనుకుంటున్నారా.. అయితే ఈ ఆహారం తప్పనిసరి ..!!

Divya
ఇటీవల కాలంలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే వారందరూ కూడా అధిక బరువును తగ్గించుకోవడానికి డైటింగ్ చేస్తూ ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మరి కొంతమంది చాలా సన్నగా ఉండడం వల్ల బరువు పెరగాలని ప్రయత్నం చేస్తూ విఫలం అవుతూ ఉంటారు. ఇక అలాంటి వారిలో మీరు కూడా ఒకరా..? అయితే ఇప్పుడు చెప్పబోయే కొన్ని పద్ధతులు పాటించారంటే బక్కగా ఉన్న మీరు కూడా బరువు పెరగవచ్చు. ముఖ్యంగా సన్నగా ఉన్నవారు బరువు పెరగడానికి ప్రతిరోజు కష్ట పడతారు అని చెప్పడంలో సందేహం లేదు.
ఇక అలాంటి వారు తమ బరువును పెంచుకోవడానికి ఎన్నో రకాల డైట్ లు ఫాలో అయినప్పటికీ బరువు మాత్రం పెరగరనే చెప్పాలి. ఇకపోతే బరువు పెరగడం.. కండరాలు పటిష్టంగా పొందడం అనేది చాలా కష్టమైన పని అని అంటున్నారు వైద్య నిపుణులు. బరువు పెరగాలనుకొనే వారు బంగాళదుంపలు పెరుగు తినడం వల్ల బరువు పెరుగుతారని సమాచారం. మన శరీరంలో కార్బోహైడ్రేట్ ల మొత్తాన్ని పెంచడం వల్ల కొవ్వు కూడా పెరుగుతుందని చాలామంది అనుకుంటారు. అయితే అది అసలు నిజం కాదు .. కార్బోహైడ్రేట్లు మాత్రమే ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారనే విషయం ఎంతవరకు అయితే నిజమో.. పిండి పదార్థాలు తినడం వల్ల కూడా బరువు పెరుగుతారాన్నది కూడా అంతే నిజం.
 ముఖ్యంగా మీరు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటున్నారో కూడా తెలుసుకోవడం చాలా అవసరం.  బంగాళదుంపలలో మనకు విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి బరువు పెరగడానికి సహాయపడుతుంది .కాబట్టి మీరు ప్రతిరోజు ఒక మీడియం సైజు బంగాళదుంపలు తీసుకోవచ్చు.

ఇక పెరుగు కూడా బరువు పెరగడానికి..అలాగే  తగ్గడానికి సహాయపడుతుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఫుల్ క్రీమ్ పాలతో చేసిన పెరుగు తింటే బరువు పెరుగుతారు. బరువు పెరగాలనుకొనే వారు ప్రతిరోజు ఈ రెండు పదార్థాలు తినడం వల్ల మీ శరీర బరువును పెంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: