ఓరి నాయనో.. మొబైల్ ఎక్కువగా వాడితే పిల్లలు పుట్టరా?

praveen
ఇటీవల కాలంలో మొబైల్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో భాగంగా మారిపోయిన విషయం తెలిసిందే. ఎంతలా అంటే మొబైల్ లేకుండా కనీసం ఒక్క క్షణం కూడా మనిషి ఉండలేనంతగా మనిషిని బానిసగా మార్చకుంది. కేవలం మనిషి అవసరాలను తీర్చడానికి వచ్చిన మొబైల్ ఇక ఇప్పుడు మనిషినే చెప్పుచేతల్లో పెట్టుకునే స్థాయికి ఎదిగింది అని చెప్పాలి. అంతలా నేటి రోజుల్లో మనుషులు మొబైల్ కి అలవాటు పడిపోయారు. అర క్షణం పాటు  చేతిలో మొబైల్ లేకపోయినా గంటసేపు పాటు బాధపడుతూ ఉంటారు అని చెప్పాలి. ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా ఇక చేతిలో మాత్రం మొబైల్ ఉండాల్సిందే.

 అంతేకాకుండా నేటి రోజుల్లో ఇక అధునాతన టెక్నాలజీతో కూడిన స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో మొబైల్ ప్రియులందరికీ కూడా సెల్ఫోన్ ప్రపంచం మరింత అందంగా మారిపోయింది. ఇక కావాల్సిన ప్రతి వస్తువు కూడా ఆన్లైన్లో దొరుకుతూ  ఉండడంతో మొబైల్ లో ఒక క్లిక్ చేస్తే సరిపోతుంది. దీంతో ఎక్కడి కి వెళ్లాల్సిన పని లేకుండా పోయింది. కాగా ప్రస్తుత రోజుల్లో  టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో అటు మొబైల్ వాడకం అయితే మరింత పెరిగి పోతుంది అని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మొబైల్ ఎక్కువగా వాడితే ఇక మనుషుల పై తీవ్రమైన ప్రభావం ఉంటుందని ఇప్పటికే నిపుణులు హెచ్చరిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.

 మరీ ముఖ్యంగా మగవారు మొబైల్ ఎక్కువగా వాడితే మరింత ప్రమాదం అంటూ చెబుతున్నారు. మగవారు ఫోన్ ఎక్కువగా వాడితే స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులను మితిమీరిన వాడకంతో పాటు ఆహార లోపాలు శారీరక శ్రమ లేకపోవడం మానసిక ఒత్తిడి లాంటి కారణాలతో పురుషుల్లో సంతానలేమి లాంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎలక్ట్రికల్ వస్తువుల నుంచి విడుదలయ్యే రేడియేషన్ ఇందుకు కారణం అంటూ చెబుతున్నారు. కాగా దేశంలో 23 శాతం మంది మగవారు ఫెర్టిలిటీ  సమస్యతో బాధపడుతూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: