'ఉప్పు'ను పూర్తిగా తినడం మానేస్తున్నారా ?

VAMSI
మనం రోజూ తినే వంటకాల్లో ఉప్పు చాలా ముఖ్యమైనది. ఉప్పు లేనిదే వంటలే చేయలేము. కానీ కొందరు మాత్రం అనారోగ్య సమస్యల కారణంగా ఉప్పు అసలు తినడం మానేస్తుంటారు. అయితే ఇలా ఉప్పును పూర్తిగా అవైడ్ చేయడం కూడా చాలా ప్రమాదకరం అని చెబుతున్నారు వైద్య నిపుణులు.  మన శరీరానికి కావల్సిన పలు ముఖ్యమైన పోషకాల్లో ఉప్పు కూడా ప్రధానమైనది. ఉప్పు వలన శరీరం లో కండరాల కదలికలు,  సమాచార అందజేయడం, ఒత్తిడిని తగ్గించడం, హృదయ స్పందనలు, వంటి జీవన ప్రక్రియలు సక్రమంగా కొనసాగుతాయి లేదంటే వాటి పనుల్లో ఆటంకం ఏర్పడి అనారోగ్యపాలవుతాం.  
ఉప్పు అంటే సోడియం క్లోరైడ్ ఇందులో 39 శాతం వరకు  సోడియం, అలాగే 61 శాతం క్లోరిన్ లు కలిపి ఉంటాయి.  ఇక మన శరీర బరువులో ఉప్పు 0.5 శాతం వరకు ఉంటుంది.  ఒకవేళ మనిషి ఎప్పుడైతే 10 రోజుల పాటు ఉప్పును తినకుండా మానేస్తాడో అప్పుడు కణాలలో ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా ద్రవాల సమతుల్యం ఏర్పడి  నీరు కణాల్లోకి చేరుతుంది.  దీని కారణంగా శరీరం అంతా ఉబ్బి పోతుంది. ఇదే కనుక మరి కాసేపు కొనసాగితే కణాలు పగిలి ప్రాణాపాయం సంభవిస్తుంది. ఉప్పును తీసుకోవడం పూర్తిగా మానేయడం వలన శరీరం లో ఏ క్రియ కూడా సక్రమంగా జరగదు అందుకనే ఉప్పును  సమ పాళ్ళలోనే  తీసుకోవాలి.
ఒకవేళ అనారోగ్య సమస్యలు ఉండి డాక్టర్లు ఉప్పు తక్కువ తీసుకోవాలి అని సూచిస్తే మాత్రం కొంచం తక్కువ మోతాదులో తీసుకోవాలి.. ముఖ్యంగా అధిక రక్త పీడనంతో బాధ పడేవారు మాత్రం ఉప్పును మీరు తీసుకునే ఆహారంలో కొంచెం మాత్రమే వాడాలి. అసలే తగ్గించినా నష్టమే... ఎక్కువైనా ప్రమాదమే. కొన్ని సార్లు ఇలా తీసుకోవడం ప్రాణానికే ప్రమాదం. కాబట్టి మీ ఆరోగ్యం తగినట్లు ఉప్పును వాడుకోండి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: