గుడ్ న్యూస్ : వ్యాయామం అవసరం లేదు.. ఒక్క టాబ్లెట్ తో?

praveen
ప్రతి రోజూ పొద్దున లేవగానే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అన్నది అందరికీ తెలిసిన నిజం ఇలా వ్యాయామం చేయడం ద్వారా అటు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది అని చెబుతూ ఉంటారు వైద్యనిపుణులు. అంతే కాకుండా ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా దరిచేరవు. అందుకే ప్రతి ఒక్కరు కూడా సమయం కుదుర్చుకుని క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అంటూ చెబుతూ ఉంటారు. కానీ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒక్కరు కూడా అటు వ్యాయామం చేయడానికి ఇష్టపడటం లేదు. ఎవరికి అంత సమయం కూడా ఉండడం లేదు అనే చెప్పాలి.

 అయితే ఇక ఇలా వ్యాయామానికి దూరంగా ఉండటం కారణంగా ఎంతోమంది బరువు పెరిగి పోవడం లాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి వారు హాస్పిటల్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. బరువు తగ్గడానికి లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అయితే ఇలాంటి సమయంలోనే వ్యాయామం చేయకుండా ఏదైనా ఔషధాలు ఉపయోగించి ఫిట్ గా ఉండేందుకు అవకాశం ఉంటే ఎంత బాగుండు అని కోరుకునే వారు కూడా ఉన్నారు అని చెప్పాలి.  వ్యాయామం చేయడం ద్వారా శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో  వాటిని టాబ్లెట్ రూపంలో అందించే దిశగా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు అన్నది తెలుస్తుంది.

 క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఎంతోమంది ఊబకాయులు సైతం బరువు తగ్గుతారు. వ్యాయామం చేసినప్పుడు సీఎన్డిసి2 అనే ఎంజాయ్ ప్రోద్బలంతోనే లాక్ పే  అనే ప్రత్యేక అమైనో ఆమ్లం ఎక్కువగా విడుదల అవుతుంది. అయితే ఇటీవల ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో ఇక ఔషధం ద్వారా కూడా ఇలాంటి ప్రక్రియ జరుగుతుందని అమెరికాలోని బళ్లారి కాలేజ్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు గుర్తించారు. బరువు ఎక్కువగా ఉన్నా ఎలుకల లో   50 శాతం వరకు తక్కువ ఆహారం తీసుకోవడానికి అది దోహదపడుతుందని నిర్ధారించారు. అనంతరం కొన్ని ఎలుకలకు కృత్రిమంగా లాక్ పే అనే అమైనో ఆమ్లం ను అందించగా వ్యాయామం చేసిన తరహాలోనే వాటిలో ప్రయోజనాలు కనిపించాయట. మరికొన్ని క్లినికల్ ట్రయల్స్ తర్వాత భవిష్యత్తులో ఇది అందుబాటులోకి తీసుకువచ్చేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: