తమలపాకు : లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

Purushottham Vinay
తమలపాకు అంటే అసలు తెలియని వారు ఉండరు. ఎందుకంటే పూజలు,వ్రతాలు ఇంకా పెళ్లిళ్లలో తమలపాకును తప్పనిసరిగా వాడతారు. ప్రతి రోజు కూడా ఒక చిన్న తమలపాకు తింటే ఖచ్చితంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.ఇక తమలపాకులో విటమిన్-సీ, థియామిన్, రైబోఫ్లోవిన్ ఇంకా కేరోటిన్ లాంటి విటమిన్లు, కాల్షియం, శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా అలాగే ఫైటోకెమికల్స్ వంటి నిరోధక సమ్మేళనాలు ఉన్నాయి. వీటిలో ఫ్లేవనాయిడ్లు, టానిన్లు, ఆల్కలాయిడ్లు, స్టెరాయిడ్లు ఇంకా అలాగే క్వినోన్లు ఉన్నాయి. కాన్సర్‌ నిరోధక కారకంగానూ తమలపాకు చాలా బాగా పనిచేస్తుంది.ఇక ఈ తమలపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్ గుణాలు గొంతు నొప్పి, ఇన్ ఫెక్షన్, దగ్గు ఇంకా అలాగే జలుబు వంటి వాటిని తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. అలాగే నోటిలో ఉండే బ్యాక్టీరియాను కూడా ఇది నాశనం చేసి నోటి దుర్వాసన లేకుండా చేస్తుంది. అలాగే చిగుళ్ళ వాపు ఇంకా అలాగే చిగుళ్ళ నుండి రక్తస్రావం వంటి వాటిని తగ్గిస్తుంది.అంతేగాక తమలపాకులో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ అనేవి అసలు రాకుండా కూడా మనల్ని కాపాడుతుంది.

అలాగే ఇందులో కాల్షియం కూడా అధికంగా లభిస్తుంది. అందువల్ల కీళ్లనొప్పులు ఇంకా అలాగే మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు ప్రతి రోజు తింటే నొప్పుల నుండి మంచి ఉపశమనం అనేది కలుగుతుంది.ఇంకా డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు ఉన్నవారికి కూడా చాలా అద్భుతంగా పనిచేసి మానసిక ప్రశాంతత కలిగేలా చేస్తుంది. ఆకలి లేనివారిలో ఆకలిని కూడా పుట్టిస్తుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం చేసి గ్యాస్,కడుపు ఉబ్బరం ఇంకా అలాగే మలబద్దకం వంటి సమస్యలు లేకుండా కూడా చేస్తుంది. అలాగే జీర్ణ సంబంద సమస్యలు ఉన్నవారు భోజనం చేసిన తర్వాత చిన్న తమలపాకుని తింటే సరిపోతుంది.కాబట్టి ఖచ్చితంగా తమలపాకుని రోజుకొకసారైనా ఖచ్చితంగా తినండి.ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంగా వుండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: