ఇలా చేస్తే షుగరు వ్యాధి రమ్మన్నా రాదు!

Purushottham Vinay
ఇక ఈ తరం వారు ఎక్కువగా డయాబెటిస్ బారిన పడుతున్నారు. దీనిని నియంత్రణలో ఉంచుకోవడానికి వివిధ రకాల మెడిసిన్స్, డైట్ ఇంకా అలాగే వ్యాయామాలు కూడా చేస్తూ వుంటారు.ఈ మూడింటిని కూడా ఎక్కువగా ఫాలో అవుతూ వుంటారు.కానీ, ఏది మొదటిగా చేయాలి ఇంకా ఏది చివరిగా చేయాలి అనేది ప్రాధాన్యత ఇచ్చి చేయాలి. అయితే ఇక మనం ఎక్కువగా వైద్యుల సలహా మేరకు ముందుగా మెడిసిన్స్, తరువాత వ్యాయామాలు ఇంకా అలాగే ఆ తరువాత డైట్ చేస్తూ వుంటాం. ఇలా చేస్తే ఎప్పటికి కూడా షుగరు వ్యాధి పోదు. మెడిసిన్స్ ఇంకా ఇంజక్షన్స్ వంటివి వాడుతూ వుండాలి.ఇలా ఎక్కువగా మెడిసిన్స్ తీసుకోకుండా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా వుండాలి అనుకున్న వారు ముందుగా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి ఇంకా ఎలా మారాలి అనే దాని గురించి తెలుసుకోవాలి. ముందుగా డైట్ అనేది ప్లాన్ చేయాలి. తరువాత వ్యాయామం ఇంకా ఆ తరువాత మెడిసిన్ ని తీసుకోవాలి. ముఖ్యంగా డైట్ అనేది డయాబెటిస్ కు చాలా చక్కటి మెడిసిన్. తరువాత ఇంకా వ్యాయామం.


ఈ రెండు కనుక సక్రమంగా నిర్వర్తిస్తే మెడిసిన్స్ అవసరం లేదు. ముందుగా మనం తినే ఆహారంలో ఖచ్చితంగా మార్పులు రావాలి. దీనికోసం ఉదయాన్నే అల్పాహారంలోకి దోసెలు, ఇడ్లీలు మానేసి, నానబెట్టుకున్న శనగలను, మొలకెత్తిన గింజలను ఇంకా అలాగే నానబెట్టుకున్న ఎండుఖర్జురాలను తినాలి.ఇక తరువాత ఏమైనా పండ్లను తీసుకోవాలి. మధ్యాహ్నం లంచ్ లోకి మిల్లెట్స్ తో చేసిన రొట్టెను కూడా తినాలి.తరువాత సాయంత్రం పూట కొబ్బరి నీళ్లను తీసుకోవాలి. వీటిలో మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మన బాడీలోని రక్తంకు కావలసిన పోషకాలు అనేవి ఈ నీళ్ల ద్వారా అందుతాయి. రాత్రికి డిన్నర్ లోకి నానబెట్టుకున్న డ్రై నట్స్ ను కూడా తినాలి. అలాగే తరువాత ఏమైనా పండ్లను తినాలి. రాత్రి ఏడుగంటల లోపు డిన్నర్ ని పూర్తి చేసుకోవాలి. రోజు ఉదయాన్నే రెండు గంటలు వ్యాయామం అనేది చేయాలి. ఇలా డైట్ ను ఫాలో అవుతూ వ్యాయామం చేస్తే ఖచ్చితంగా షుగరు వ్యాధి రమ్మన్నా రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: