యవ్వనంగా కనిపించాలంటే వీటిని ఖచ్చితంగా తినాల్సిందే..!!

Divya
కరోనా సమయంలో ప్రతిరోజు కి తీవ్రమైన ఒత్తిడి పెరగడంతో పాటు కాలుష్యం వల్ల కూడా యవ్వనంగా కనిపించ లేకపోతున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు మీరు అవసరమైన పోషకాలు ఉన్న ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదిగా తగ్గించవచ్చు. యాంటీ ఏజింగ్ క్రీమ్లు, ఫేస్ ప్యాక్ తో కేవలం తాత్కాలికంగానే పనిచేస్తాయి. ఇది మంచి కంటే ఎక్కువగా హాని కలిగిస్తాయని కొంతమంది నిపుణులు తెలుపుతున్నారు. సహజ సిద్ధమైన మెరుపును పొందాలంటే కేవలం మనం తినే వాటిలో కాస్త డైట్ ని చేర్చుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు వాటి గురించి చూద్దాం.
1). క్యారెట్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి, క్యాన్సర్ వంటి జబ్బులు తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. క్యారెట్ లో బీటాకెరోటిన్ ఉండడం వల్ల మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ల వల్ల ఇది మన చర్మాన్ని రక్షిస్తుంది.
2). ఉల్లిపాయలు ఎక్కువగా తినడం వల్ల రక్తాన్ని పలుచగా మార్చడానికి, కలర్స్ మంచి కొలెస్ట్రాల్ ను పెంచడానికి ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ వల్ల యాంటీ ఏజింగ్ ప్రయోజనాలు చాలానే ఉన్నాయి.
3). బచ్చలికూర శక్తివంతమైన యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయట. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. బచ్చలికూర లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది వృద్ధాప్య ఛాయలు దగ్గరకు రానివ్వదు.

4). టమోటాలో లైకోపిన్ ఉండడం వల్ల ఇది మన మెదడు ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు సహాయపడుతూ ఉంటుంది. టమోటాలు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల క్యాన్సర్ వంటివి రానివ్వకుండా చేస్తాయి.
5). ద్రాక్ష లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండడంవల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు చర్మంపై వచ్చేటువంటి మంటలు కూడా తొలగిస్తాయి. హానికరమైన సూర్యకిరణాల నుంచి మనల్ని రక్షిస్తూ ఉంటాయి.
6). క్యాబేజీలో శక్తివంతమైన యాంటీ ఏజింగ్ ఉండడం వల్ల చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడుతూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: