నిమ్మకాయ రసంతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు!

Purushottham Vinay
వేసవి కాలం వచ్చిందంటే చాలు నిమ్మకాయలకు ఎక్కడ లేని డిమాండ్ వస్తుంది. అందులోనూ ప్రస్తుతం నిమ్మ కాయ ధర కొండెక్కింది. ఒక్కోటి పది రూపాలు ఇప్పుడు అమ్ముడుపోతోంది. ఇక ఈ సంగతిపక్కన పెడితే.. వేసవిలోనే నిమ్మ కాయను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అందులో ఈ సీజన్ లో చాలా మంది లెమన్ వాటర్ ను ఇష్టంగా తాగుతుంటారు. ఈ వాటర్ ను తాగడం వల్ల వేసవి కాలంలో తాపం తీరడంతో పాటుగా..అలాగే హైడ్రేటెడ్ గా కూడా ఉంటారు.ఇక అంతేకాదు లెమన్ వాటర్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది. అలాగే ఈ నిమ్మ కాయ శరీరాన్ని కూల్ గా ఉంచుతుంది కూడా.నిమ్మ కాయ రసం గనుక తాగితే బరువు తగ్గుతారా అంటే క్రమం తప్పకుండా నిమ్మరసం తాగడం వల్ల చాలా సులభంగా బరువు తగ్గుతారని చాలా మంది కూడా చెప్తూ ఉంటారు.

ఉదయాన్నే ఒక గ్లాస్ నిమ్మరసంలో కాస్త తేనెని మిక్స్ చేసి లేదా అలాగే తాగినా కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇక నిజానికి నిమ్మకాయ నీరు ఎన్నో సమస్యలను కూడా దూరం చేస్తుంది.నిమ్మకాయ ఒక సిట్రస్ ఫ్రూట్. ఇందులో సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ బి6 పొటాషియం ఇంకా ఫైబర్ ఇంకా అలాగే పెక్టిన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తాయి. అలాగే శరీరానికి హానీ చేసే ప్రీ రాడికల్స్ నుంచి కూడా మనల్ని రక్షిస్తాయి.ఇక నిమ్మకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి రోగాల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.నిమ్మకాయ నీటిని తాగడం వల్ల కడుపు ఇంకా నడుము చుట్టూ కూడా పేరుకుపోయిన కొవ్వు తగ్గడం ప్రారంభమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంటే నిమ్మరసం బరువును తగ్గించడానికి చాలా సహాయపడుతుందన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: