ఆకుకూరలలో మేటి తోటకూర.. ప్రయోజనాలెన్నో..!!

Divya
సాధారణంగా అటు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. ఇటు వైద్యులు చెప్పే సలహాల ప్రకారం ఆకుకూరలను పుష్కలంగా తినమని చెబుతుంటారు. ఇకపోతే ఆకుకూరల ను పుష్కలంగా తినడం వలన వీటిలో లభించే పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు మనకు సమృద్ధిగా లభిస్తాయి అని వైద్యులు సైతం సలహా ఇస్తున్నారు. ఇక అలాంటి ఆకు కూరలలో తోటకూర కూడా మంచి ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇక తోటకూర ను ప్రతి రోజూ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయం ఇప్పుడు ఒకసారి చదివితే తెలుస్తుంది.
తోటకూరను ఎక్కువగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు.. బాలింత స్త్రీలు అలాగే రక్తపోటుతో బాధపడుతున్న వారు కూడా తమ ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటూ ఉంటారు. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు ఈ తోటకూరను వేపుడు గా కంటే కూరగా చేసుకుని తినడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. తోట కూర తినడం వల్ల ఎక్కువ శాతం ప్రొటీన్లు శరీరానికి లభిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు.. తోటకూరను తమ డైట్ లో ఒక భాగంగా చేసుకోవచ్చు. బరువు తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి.
అంతేకాదు జీర్ణశక్తిని పెంపొందించడంలో తోటకూర చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే పీచు పదార్థాల కారణంగా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ బయటకు నెట్టివేయబడుతుంది. క్యాల్షియం,  మెగ్నీషియం, ఇనుము, జింక్,  ఫాస్ఫరస్, మాంగనీస్,కాపర్ , సెలీనియం వంటి ఖనిజాలు అన్ని తోటకూరలో పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు ఇందులో ఉండే పొటాషియం కారణంగా గుండె ఆరోగ్యాన్ని పదిలంగా చేస్తాయి . అలాగే ఎముకలు బలంగా ఉండేలాగా తోటకూర సహాయపడుతుంది. ఇక తోటకూర విటమిన్ ఎ,విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ తో పాటు కె , విటమిన్ బి12, బి6 వంటివి కూడా లభిస్తాయి. కాబట్టి రోజు వారి ఆహారంలో పప్పు లాగా.. కూర లాగా తోటకూర చేసుకొని తినడం వల్ల శరీరానికి కావలసిన అన్ని పోషకాలు,  విటమిన్లు లభిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: