పుచ్చకాయతో కలిగే లాభాలు..

Purushottham Vinay
 ఎండాకాలంలో పుచ్చకాయను తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. వేసవి తాపాన్ని, దాహార్తిని తీర్చేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మన శరీరంలో వాటర్‌ లెవెల్స్‌ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఒక్కోసారి డీహైడ్రేషన్‌ స్టేజిలోకి వెళ్లిపోతుంటాం. అలాంటి టైంలో వడ దెబ్బ తగిలి కళ్లు తిరిగి కిందపడిపోతుంటారు. అంతేకాదు ఒక్కోసారి ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే శరీరంలో వాటర్‌ స్థాయి తగ్గిపోకుండా ఉండేందుకు పుచ్చకాయ ఎంతగానో సహాయపడుతుంది. ఇందులో విటమిన్లు ఇంకా పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వ్యాధి నిరోధక శక్తి పెంచే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‌-బీ, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పోటాషియం, క్లోరిన్‌, జిటాకేరోటిన్లు, ఆల్కలైన్‌, విటమిన్‌-ఏ, విటమిన్‌ -బీ6, విటమిన్‌-సి వంటివి చాలా పుష్కలంగా లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు.

పుచ్చకాయతో కలిగే లాభాలు:

పుచ్చకాయ రక్తపోటు ఇంకా గుండెపోటును నివారిస్తుంది.అలాగే మధుమేహం ఉన్నవారికి కూడా ఇది మంచి ఔషధంగా పని చేస్తుంది.ఇంకా అలాగే క్యాన్సర్‌ వ్యాధిని తగ్గించే గుణం పుచ్చకాయలో ఉంది.ఇంకా అలాగే గర్భిణీ మహిళలకు తింటే పుట్టబోయే బిడ్డ కూడా పుచ్చకాయ తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు.ఇంకా అలాగే కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు, తేనెలో కలిపి పుచ్చకాయను కనుక తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.పుచ్చ కాయతో డీహైడ్రేషన్ సమస్యను కూడా నివారించవచ్చు.అలాగే ఎండ వల్ల వచ్చే దద్దుర్లను కూడా పుచ్చ కాయ తగ్గిస్తుంది.ఇంకా బీపితో బాధ పడే వారి బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది.ఇంకా శరీరంలో రక్త సరఫరాని బాగా మెరుగుపరుస్తుంది.అంతేగాక శరీరంలోని వ్యర్ధాలను బయటికి పంపిస్తుంది.ఇంకా నాడీ వ్యవస్థ పని తీరుని కూడా మెరుగుపరుస్తుంది.మనసుకు శరీరానికి ప్రశాంతతను కూడా చేకూరుస్తుంది.అలాగే ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఇంకా మలబద్ధకంతో బాధపడేవారికి కూడా ఈ పుచ్చకాయ ఎంతగానో మంచిది.కాల్షియం ఎక్కువగా ఉన్న పుచ్చకాయ తింటే కీళ్లనొప్పులు ఇంకా అలాగే వాతం లాంటి రోగాలు తక్షణమే నయమవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: