ఎప్పటికీ ఎక్స్పైర్ అవ్వని ఫుడ్స్ ఏంటో తెలుసా..?

Divya
మార్కెట్ లో ఏదైనా ఉత్పత్తిని కొనుగోలు చేసే ముందు మనం గడువు తేదీని తనిఖీ చేయడం సహజమే.. గడువు ముగిసిన తర్వాత ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి కూడా ఒప్పుకోరు.. ఏవైనా సరే ఉత్పత్తి గడువు లోపల ఉంటేనే ఆ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఎప్పటికీ గడువు ముగియని, లేబుల్ చేయని ఆహార పదార్థాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా.. అవి ఏంటో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే.. కొన్ని ఆహారాలు గడువు తేదీని కలిగి ఉండవు.. మీరు ఎప్పటికీ నిల్వ చేసుకోగల ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు ఒకసారి మనం చదివి తెలుసుకుందాం..

ఉప్పు:
ఉప్పు అనేది సహజ సంరక్షణకారి.. ఇక దీనికి ఎప్పటికి ఎక్స్పైర్ అనేది ఉండదు.. చట్నీలు , ఊరగాయలు, స్నాక్స్ వంటి ఆహారపదార్థాలను సురక్షితంగా నిల్వ ఉంచడంలో ఈ ఉప్పు చాలా ఉపయోగపడుతుంది. సముద్రపు నీటి నుండి ఉప్పును తీసిన తర్వాత ఇది ఎప్పటికీ కూడా నిజమైన రుచిని కోల్పోదు.

తేనె:
నిస్సందేహంగా దీనిని ద్రవ బంగారం అని పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా తేనె పోషకాలతో నిండి ఉంటుంది. కాబట్టి దీనికి ఎప్పటికి కూడా ఎక్స్ పైర్ అనేది ఉండదు.. తేనె ఎక్స్పైరీ డేట్ గురించి ఆలోచించకుండా ఎప్పుడైనా సరే ఆనందించగల ఆహారాలలో ఇది కూడా ఒకటని చెప్పవచ్చు..

కాఫీ:
కాఫీ కూడా ఎప్పటికీ ఎక్స్పైర్ అవదు అని చెప్పవచ్చు. కాఫీ పొడిని సాంద్రీకృత మిశ్రమాన్ని ఎండబెట్టి దాని తర్వాత ఇన్స్టెంట్ కాఫీని తయారు చేస్తారు. ఇక కాఫీ పొడిని వేడి గాలిని ఉపయోగించి ఆరబెట్టి.. ద్రవాన్ని మృదువైన కాఫీ పౌడర్ గా మార్చడం జరుగుతుంది. ఇక పూర్తిగా ఎండబెట్టే ప్రక్రియలో నీరు, తేమ లేకుండా చేస్తారు .. కాబట్టి చెడిపోయే అవకాశం కూడా ఉండదు. కాబట్టి నిస్సందేహంగా ఉపయోగించవచ్చు.

సోయా సాస్:
పులియబెట్టిన సాస్ కు  ప్రతి వేరియంట్ కు మంచి రుచి ఇస్తుంది. సోయా సాస్ బాటిల్ ఓపెన్ చేయనంతవరకు దశాబ్దాలపాటు నిల్వ ఉంటుంది. అంతే కాదు ఇందులో వేసే ఉప్పు షెల్ఫ్ లైఫ్ ను కూడా పెంచుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: