బ్లాక్ ఫంగ‌స్ : బ్లాక్ ఫంగ‌స్సా ఆందోళ‌న వ‌ద్దే వ‌ద్దు

N ANJANEYULU
దేశంలో ఒక వైపు ఒమిక్రాన్‌, మరొక వైపు క‌రోనా కేసులు విప‌రీతంగా పెరుగుతూనే ఉన్నాయి. గ‌తంలో ఎన్న‌డూ కూడా న‌మోదు కాన‌టువంటి కేసులు ఇప్పుడు థ‌ర్డ్ వేవ్ స‌మ‌యంలో న‌మోదు కావ‌డం విశేషం. అయితే నిత్యం రెండు ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోదు అవుతున్న త‌రుణంలో ఓ వైపు ఒమిక్రాన్ విస్త‌రించ‌డం మూలంగా దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లంద‌రూ భ‌య‌బ్రాంతుల‌కు గుర‌వుతున్నారు. ఈ త‌రుణంలోనే గ‌త ఏడాది సెకండ్ వేవ్‌లో వ‌ణుకు పుట్టించిన బ్లాక్ ఫంగ‌స్ మ‌ళ్లీ పంజా విస‌ర‌డం మొద‌లెట్టింది.

 
ప్ర‌స్తుతం థ‌ర్డ్‌వేవ్‌లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో  ఓ వ్య‌క్తి బ్లాక్ ఫంగ‌స్ తో ఆస్ప‌త్రిలో జాయిన్ అయ్యాడు. అయితే బ్లాక్ ఫంగ‌స్ అత‌ని క‌న్ను, ముక్కుల‌కు వ్యాపించిన‌ద‌ని వైద్యాధికారులు వెల్ల‌డించారు. క‌రోనా థ‌ర్డ్ వేవ్‌లో ఇదే తొలి కేసు అని వైద్యాధికార వ‌ర్గాలు పేర్కొన్నాయి. 45 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు క‌లిగిన వ్య‌క్తికి బ్లాక్ ఫంగ‌స్ సోకిన‌ట్టు తేలిది. అత‌నికి మ‌దుమేహం కూడా ఉంద‌ని వైద్యులు వెల్ల‌డించారు.
 షుగ‌ర్ కార‌ణంగానే  ఈ  వ్య‌క్తికి  బ్లాక్ ఫంగ‌స్ సోకిన‌ట్టు వైద్యులు భావిస్తూ ఉన్నారు. ప్ర‌స్తుతం అత‌నినీ బ్లాక్ ఫంగస్ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్న‌ట్టు కాన్పూర్ జీఎస్‌వీఎం మెడిక‌ల్ క‌ళాశాల ప్రిన్సిపల్ డాక్ట‌ర్ సంజయ్ క‌లా వెల్ల‌డించారు.  ఇత‌ను కాన్పూర్‌లోని కాంటి నివాసి అని పేర్కొన్నారు. ఆ స‌ద‌రు వ్య‌క్తికి తొలుత క‌రోనా సోకింద‌ని, ఆ త‌రువాత బ్లాక్ ఫంగ‌స్ వెలుగులోకి వ‌చ్చిన‌ట్టు వివ‌రించారు. ముఖ్యంగా మ‌ధుమేహం స‌మ‌స్య కార‌ణంగానే ప్ర‌స్తుతం అత‌నికి చికిత్స అందిస్తున్న‌ట్టు చెప్పారు.
సెకండ్ వేవ్ స‌మ‌యంలో బ్లాక్ ఫంగ‌స్ బారీగానే సోకిన‌ది. ఫంగ‌స్ కార‌ణంగా ప‌లువురు కంటి చూపును కోల్పోయిన విష‌యం అంద‌రికీ తెలిసిన‌దే. మ‌రొక‌సారి కేసులు వెలుగులోకి రావ‌డంతో ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు వ్య‌క్తం అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా డ‌యాబెటిస్‌ను నియంత్ర‌ణ‌లో ఉంచుకోవాల‌ని, స్టెరాయిడ్‌లు ఇష్టం వ‌చ్చిన‌ట్టు కాకుండా జాగ్ర‌త్త‌గా వాడాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. బ్లాక్ ఫంగ‌స్ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే.. మాత్రం వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించాల‌ని నిపుణులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: