కరోనా వేళ ఆరోగ్యంగా ఉండాలి అంటే..?

Divya
కరోనా.. ఎవరి శరీరం లో అయితే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో.. వారిని ఎక్కువగా ఈ కరోనా చుట్టుముడుతోంది. అందుకే ఈ కరోనా వేళ మనం మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం తో పాటు దృఢంగా తయారవ్వాలి. అప్పుడు ఈ కరోనా వైరస్ మాత్రమే కాదు ఎలాంటి హానికరమైన వైరస్ అయినా సరే మన శరీరంలో ఎక్కువ కాలం నిలవ లేవు. కాబట్టి మనం ముందుగా మన రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..

ఆరెంజ్:
నారింజ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ సి మనం ఎప్పుడైతే ఎక్కువగా తీసుకుంటామో అప్పుడు మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి శరీరంలోకి ప్రవేశించే ఏ ఇతర వ్యాధి కారక వైరస్ లను అయినా నాశనం చేయడానికి ఈ విటమిన్ సి సహాయపడుతుంది. అందుకే వైద్యులు కూడా తరచూ జ్వరం, ఒళ్ళు నొప్పులు వంటి సమస్యలు వచ్చినప్పుడు ఎక్కువగా ఆరెంజ్ పండ్లు తినమని సలహా ఇస్తూ ఉంటారు. ఎంత వీలైతే అంత ముఖ్యంగా ఈ కరోనా కాలంలో ఆరెంజ్ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.
నిమ్మకాయ:
నిమ్మకాయ పుల్లగా ఉంటుంది కాబట్టి సమృద్ధిగా మనకు విటమిన్ సి లభిస్తుంది. ఇక ప్రతిరోజూ ఒక గ్లాసు నిమ్మరసం తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది.
జింక్:
జింక్ పోషకం కలిగిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. ముఖ్యంగా మనకు మాంసాహార కృతులలో ఎక్కువగా లభిస్తుంది. ఇక ప్రతిరోజూ మాంసాహారం కాకుండా వారంలో రెండు సార్లు తక్కువ మోతాదులో మాంసాహారం తీసుకోవడం వల్ల మన శరీరానికి కావలసిన జింక్ కూడా సమృద్ధిగా లభిస్తుంది.
వీటి తో పాటు గుడ్లు, చేపలు, తాజా ఆకుకూరలు ,పండ్ల రసాలు, వేరుశనగ , విత్తనాలు, బెల్లం వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: