హైబీపీ : డోంట్ వర్రీ.. ఇలా చెక్ పెట్టొచ్చు..

Purushottham Vinay
ఈ మధ్యకాలంలో చాలామంది కూడా అధిక రక్తపోటు(హైబీపీ) సమస్యతో చాలా ఎక్కువగా బాధపడుతున్నారు. దీనికి అనేక రకాల కారణాలు ఉండొచ్చు. ఈ ఉరుకుల పరుగుల జీవితం ఇంకా అలాగే ఎప్పుడూ ఏదొక పని ఒత్తిడి..అది పర్సనల్ కావొచ్చు లేదా ప్రొఫిషినల్ కావొచ్చు. ఇంకా అలాగే ముఖ్యంగా జంక్ ఫుడ్ అలవాట్లు కారణంగా కూడా ఈ రక్తపోటు బాధితుల సంఖ్య అనేది క్రమేపీ పెరుగుతూ పోతోంది. ఉప్పు, మసాలాలు ఇంకా అలాగే ప్రోసెస్డ్ ఫుడ్ లాంటి పదార్ధాలను దూరంగా పెట్టాలని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అలాగే హైబీపీ వల్ల కూడా పలుసార్లు గుండె ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక రక్తపోటు సమస్యను కనుక మనం కంట్రోల్‌లోకి తీసుకురాకపోతే.. గుండెపోటు సమస్య, ధమని గోడలు బలహీనపడటం ఇంకా హార్ట్ ఫెయిల్యూర్, కళ్లు, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం, మెటబాలిక్ సిండ్రోమ్, జ్ఞాపకశక్తి మందగించడం ఇంకా అలాగే అవగాహనా లోపం తలెత్తడం వంటి అనారోగ్య సమస్యలు అనేవి తలెత్తుతాయి.

ఇక హైబీపీ సమస్యని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి..
1.ఉప్పు కలిగిన నట్స్ ఇంకా సీడ్స్‌ను అస్సలు తినొద్దు
2.అధిక రక్తపోటును తగ్గించేందుకు ఖచ్చితంగా డానికి అనువైన డైట్‌ను ఫాలో అవ్వండి.
3.పొటాషియం, కాల్షియం ఇంకా మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినండి.
4.సంతృప్త కొవ్వులు ఇంకా అలాగే చక్కెర తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
5.తాజా పండ్లు ఇంకా అలాగే కూరగాయలనుమీ డైట్‌లో చేర్చండి
6.కొవ్వు తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు ఖచ్చితంగా తీసుకోవాలి
7.సిరిల్స్,పప్పు ధాన్యాలు ఇంకా చిక్కుళ్లు తినాలి.
8.చేపలు ఇంకా గుడ్లు రోజు తీసుకోవాలి
9.ఫ్రోజన్ ఇంకా ప్యాకేజ్డ్ ఆహారాలకు ఖచ్చితంగా దూరంగా ఉండండి.
10.తీపి పదార్ధాలు ఇంకా కూల్ డ్రింక్స్‌ను ఖచ్చితంగా అవాయిడ్ చేయండి.
11.పచ్చళ్లు ఇంకా అప్పడాలు అస్సలు తీసుకోవద్దు.

కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు తెలుసుకొని పైన పేర్కొన్న టిప్స్ ని ఖచ్చితంగా పాటించండి. ఖచ్చితంగా హైబీపీ సమస్య అనేది తగ్గిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: