క‌రోనా : గాంధీలో క‌రోనా క‌ల‌క‌లం.. 44 మంది డాక్ట‌ర్ల‌కు పాజిటివ్‌..!

N ANJANEYULU
దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ మ‌రింతగా జోరందుకుంది. నిత్యం ల‌క్ష‌లాది కేసులు న‌మోదు అవుతున్నాయి. సాధార‌ణ ప్ర‌జ‌ల నుంచి సెల‌బ్రిటీలు, రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు క‌రోనా బారిన ప‌డుతూ ఉన్నారు. దీంతో పాటు క‌రోనా విపత్క‌ర ప‌రిస్థితుల్లో కూడా చికిత్స అందించే వైద్యులు క‌రోనా మ‌హ‌మ్మారి వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఇటీవ‌ల దేశ రాజ‌ధాని ఢిల్లీలో వందలాది మంది వైద్యులు, ఆరోగ్య‌కార్య‌క‌ర్త‌లతో పాటు దాదాపు 1000 మంది పోలీసులు కూడా క‌రోనా బారిన ప‌డిన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు. అయితే వైర‌స్ నిర్థార‌ణ అయిన వారంద‌రూ ప్ర‌స్తుతం ఇండ్ల‌లోనే ఉండి చికిత్స పొందుతూ ఉన్నారు. క‌రోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీలో మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసారు.
ఈ త‌రుణంలో తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్ లో సైతం క‌రోనా బారీగానే క‌రోనా బారిన ప‌డుతున్నారు. భారీ ఎత్తున వైద్యులు, వైద్య విద్యార్థులతో పాటు ప్ర‌జ‌లను కొవిడ్ వెంటాడుతుంది.  తాజాగా సికింద్రాబాద్ గాంధీ ఆసుప‌త్రిలో 44 మంది డాక్ట‌ర్ల‌కు క‌రోనా వైర‌స్ పాజిటివ్‌గా నిర్థార‌ణ అయింది. అందులో 30 మంది మెడికోలు, వీరితో పాటు 10 మంది పీజీ వైద్యులు, న‌లుగురు ప్రొఫెస‌ర్ల‌కు పాజిటివ్ సోకిన‌ట్టు తేలింది. అదేవిధంగా  వ‌రంగ‌ల్‌లోని కాక‌తీయ మెడిక‌ల్ క‌ళాశాల‌లో కూడా 30 మంది మెడికోలు క‌రోనా బారిన ప‌డ్డారు.  
హైద‌రాబాద్‌లోని పంజాగుట్ట నిమ్స్ ఆసుప‌త్రిలో 60 మందికి పైగా వైద్యులు, వైద్య‌విద్యార్థుల‌కు క‌రోనా సోకిన‌ట్టు వెల్ల‌డి అయింది. థ‌ర్డ్ వేవ్ ఎక్కువ‌గా ప్ర‌భావం చూపిస్తోంద‌ని వైద్యులు పేర్కొంటున్నారు. దీంతో వైద్యులు ఐసోలేష‌న్ లో ఉంటూ చికిత్స తీసుకుంటూ ఉన్నారు. పెద్ద ఎత్తున వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి క‌రోనా సోక‌డంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళ‌న మొద‌లైంది. మ‌రొక‌వైపు గాంధీ ఆసుపత్రిలో పెద్దెత్తున వైద్యులు కరోనా బారిన ప‌డుతుండ‌టంతో ఆసుప‌త్రిలో రోగుల‌కు సేవ‌లందించేందుకు అంత‌రాయం క‌లుగుతుంద‌ని పేర్కొంటున్నారు. ఈ త‌రుణంలో సేవ‌ల‌కు అంత‌రాయం క‌లుగ‌కుండా అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: