మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా... ?

VAMSI
మారుతున్న కాలాన్ని బట్టి మనుషుల జీవన శైలి కూడా ఎంత గానో మారింది. ఆహారపు అలవాట్లు కూడా బాగా మారాయి. వివిధ కారణాల వలన మానసికంగా ఒత్తిడిలు పెరిగాయి వీటన్నిటి వలన ఎన్నో రకాల కొత్త జబ్బులు పుట్టుకొస్తున్నాయి. అయితే చాలా మంది మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. మెంటల్ గా బాగా డిస్టర్బ్ అవ్వడం , మనసును బాధ పెట్టే ఆలోచనల నుండి బయటకు రాలేక పోవడం, మానసికంగా కుంగి పోవడం, లేనిది ఉన్నట్టు ఊహించుకోవడం, ప్రతి చిన్న దానికి అతిగా ఊహించుకుని ఆందోళన చెందటం, నిద్ర సరిగా పట్టకపోవడం, చిన్న బాధాకరమైన వార్త విన్న, పెద్దగా విన్న గుండెల్లో దడ పుట్టడం.
ఎంత అనుకున్నా అర్దరాత్రి దాటుతున్నా నిద్ర రాకపోవడం, చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా దాన్ని బూతద్దంలో పెట్టి చూసి టెన్షన్ పడటం, ఎవరి కైనా ఏదైనా కష్టం వస్తే మనం ఎక్కువగా ఆందోళన చెందటం... ఆ సమస్య మనకీ వస్తుందేమో అని ఒత్తిడికి లోనవడం వంటివి జరుగుతుంటాయి. అయితే చాలా మంది ఈ సమస్యల నుండి బయట పడేందుకు ఎన్నో ఆసుపత్రులు చుట్టూ తిరిగి ఉంటారు, ఎన్నో ఔషధాలను వాడి ఉంటారు, ఇప్పటికే వాడుతూ ఉండొచ్చు, ఇలాంటి సమస్యలు ఉన్న కొందరిని అయితే మానసిక వికలాంగులను చూసినట్లు చూస్తుంటారు. వారికి పిచ్చి అని అంటుంటారు.
దీనిని నయం చేసుకోవడం కోసం ఎన్నో హాస్పిటల్స్ కి తిప్పుతుంటారు. అయినా వారి సమస్య తీరి ఉండక పోవచ్చు. అలాంటి వారికి కొందరు అనుభవజ్ఞులు చెబుతున్న ఒక చిన్న సలహా ఏమిటంటే..? మీరు కనుక ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లు అయితే వారు ఒకసారి ఆంధ్రప్రదేశ్ , చిత్తూర్ జిల్లాలో ఉన్న తిరుపతి లోని మహిళల హాస్పిటల్ కు వెళ్ళండి. ఇక్కడ అనుభవజ్ఞులైన వైద్యులు రోగిని బాగా పరిశీలించి పరిష్కరిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: