క‌రోనా : ఇక అన్ని వేరియంట్ల‌ను ఎదుర్కునే టీకా..!

N ANJANEYULU
  ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా మ‌హ‌మ్మారి క‌ల‌క‌లం సృష్టిస్తోంది. మ‌రొక వైపు ఒమిక్రాన్ విజృంభిస్తూ జ‌నాల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురి చేస్తోంది. వారు వీరు అని తేడా లేకుండా ఎవ్వ‌రినీ కూడా వ‌ద‌ల‌డం లేదు. ఈ మ‌హ‌మ్మారి బారి నుంచి ర‌క్షించుకునేంద‌కు ఇప్ప‌టికే ఆయా దేశాలు ముమ్మ‌రంగా వ్యాక్సిన్ ప్ర‌క్రియ‌ను కొన‌సాగిస్తున్నాయి. ఇక భార‌త్‌లో అయితే శ‌ర‌వేగంగా వ్యాక్సిన్ చేస్తున్నారు. ఇప్ప‌టికే తొలిడోస్‌, రెండ‌వ డోస్ పూర్త‌యిన వారికి నిన్న‌టి నుంచి బూస్ట‌ర్ డోస్ ఫ్రంట్ వారియ‌ర్స్‌కు పంపిణీ చేస్తున్నారు.
తాజాగా  భార‌త  సంత‌తి ప‌రిశోధ‌కులు అజిత్‌ లాల్ వానీ మీడియాతో ముచ్చ‌టించారు. ముఖ్యంగా సాదార‌ణ జ‌లుబు క‌లిగించే కొన్ని ర‌కాల క‌రోనా వైర‌స్ బారిన ప‌డిన వారికీ ప్ర‌స్తుతం కొవిడ్ కార‌క సార్స్- కోవ్ 2 నుంచి మెరుగైన ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌ని వెల్ల‌డి అయింది.గ‌తంలో అధిక స్థాయిలో వెలువ‌డిన టీ కాణాల వ‌ల్ల ఇలాంటి వారు ప్ర‌స్తుతం కొవిడ్‌19 బారిన‌ప‌డే అవకాశం త‌క్కువ‌ని లండ‌న్‌లోని ఇంపీరియ‌ల్ క‌ళాశాల శాస్త్రవేత్త‌లు తేల్చారు. ఈ బృందానికి భార‌త  సంత‌తి ప‌రిశోధ‌కులు అజిత్‌ లాల్ వానీ  నేతృత్వం వ‌హించారు. కోవిడ్ నుండి ర‌క్షించ‌డంలో టీ కణాల పాత్ర‌ను నిర్థారించే మొద‌టి ఆధారాన్ని ఈ ప‌రిశోధ‌న ద్వారా అందించామ‌ని ఆయ‌న తెలిపారు.
ఒమిక్రాన్ తో స‌హా ప్ర‌స్తుత భ‌విష్య‌త్ క‌రోనా వేరియంట్‌ల నుంచి ర‌క్ష‌ణ కల్పించే రెండ‌వ త‌రం సార్వ‌త్రిక టీకాల త‌యారీకి ఈ ప‌రిశోధ‌న దోహ‌ద‌ప‌డుతుంద‌ని వివ‌రించారు. ఇత‌ర క‌రోనా వైర‌స్‌ల వ‌ల్ల వెలువ‌డిన టీ క‌ణాలు సార్స్‌-కోవ్ 2 వైర‌స్ ను ప‌సిగ‌ట్ట‌గ‌ల‌వ‌ని ఇప్ప‌టికే ప‌లు ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. తాజా అధ్య‌య‌నంలో కోవిడ్ కార‌క వైర‌స్ సోకిన‌ప్పుడు ఈ టీ క‌ణాలు ఎలా స్పందిస్తాయ‌న్న‌ది శాస్త్రవేత్త‌లు శోధించారు. వైర‌స్ ఉప‌రిత‌లంపై ఉండే స్పైక్ ప్రొటోన్‌ను కాకుండా వాటి లోప‌ల ఉండే ఇత‌ర ప్రోటీన్ల‌పై దాడి చేయ‌డం ద్వారా ఈ క‌ణాలు ర‌క్ష‌ణ క‌ల్పిస్తాయ‌ని వెల్ల‌డి అయింది. వాక్సినేష‌న్ కార‌ణంగా ప్ర‌జ‌ల్లో ఉత్ప‌త్తి అవుతున్న యాంటిబాడీల వ‌ల్ల స్పైక్ ప్రోటీన్‌పై తీవ్ర ఒత్తిడి ప‌డుతుంది. టీకాల‌ను అమ‌ర్చే ఉత్ప‌రివ‌ర్త‌న‌ల పుట్టుకకు అది దారి తీస్తోంది. దీనికి భిన్నంగా క‌రోనాలోని అంత‌ర్గ‌త ప్రోటీన్లు చాలా త‌క్కువ‌గా ఉత్ప‌రివ‌ర్త‌నం చెందుతాయి. టీ క‌ణాలు వీటినే ల‌క్ష్యంగా చేసుకుంటాయి. వీటి వ‌ల్ల క‌రోనాలోని అన్ని వేరియంట్ల నుంచి మెరుగైన ర‌క్ష‌ణ పొంద‌వ‌చ్చని అజిత్ పేర్కొన్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: