బాలింతలు త్వరగా కోలుకునే బలమైన ఆహారం..

Purushottham Vinay
దేవుని సృష్టిలో అపురూపమైనది స్త్రీ…స్త్రీకి మాతృత్వం అందించే అనుభూతి మరపురానిది.“అమ్మ” తన ఆరోగ్యం కన్నా కూడా కన్న బిడ్డ ఆరోగ్యంపైనే చాలా ఎక్కువ దృష్టిపెడుతుంది.అమ్మ తన కన్న తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుతుంది.తన ముద్దు బిడ్డ కోసం తన ఆహారపు అలవాట్లను మరిచిపోతుంది. తనకు అంతా ఆ ముద్దు బిడ్డే అన్నట్లుగా మార్చుకుంటుంది. ఇక సాధారణ ప్రసవం తర్వాత స్త్రీ త్వరగానే కోలుకుంటుంది. అయితే సి-సెక్షన్ డెలివరీలో స్త్రీ సాధారణ స్థితికి రావడానికి కొంత టైం పడుతుంది. అటువంటి పరిస్థితిలో “అమ్మ” చాలా కాలం పాటు విశ్రాంతి ఇంకా అలాగే ఆహారంపై ఖచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి.ఇక ఆపరేషన్ కారణంగా శరీరం చాలా బలహీనంగా ఉంటుంది కాబట్టి బిడ్డకు ఆహారం ఎలా ఇవ్వాలి? అందుకే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత మహిళలు ఖచ్చితంగా ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరం.
ఇక స్త్రీ ఆహారంలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం వంటి పోషకాలను ఖచ్చితంగా చేర్చాల్సిన అవసరం ఉంది. అయితే, సి-సెక్షన్ డెలివరీ తర్వాత మహిళ జీర్ణవ్యవస్థ బాగా క్షీణిస్తుంది. కాబట్టి ఆమె ఆహారం అంతగా తినలేక పోతుంది. అందువల్ల డాక్టర్ ని సంప్రదించిన తర్వాత స్త్రీ తన ఆహార ప్రణాళికను సిద్ధం చేయాలి.కనీసం 6 నెలల పాటు ఇంట్లో వండిన తాజా ఆహారాన్ని తినాలి.బయటి ఆహారాన్ని ఇంకా అలాగే జిడ్డుగల మసాలా ఆహారాన్ని అసలు పూర్తిగా మానుకోండి. ఏ సందర్భంలోనైనా కాని రాత్రి భోజనం 8 గంటలకు తినండి. అందువల్ల అది పూర్తిగా జీర్ణమవుతుంది.
మీకు అర్థరాత్రి కనుక ఆకలిగా అనిపిస్తే, మీరు మఖానా ఇంకా పఫ్డ్ రైస్ మొదలైనవి తీసుకోవచ్చు.ఇక కాల్షియం లోపాన్ని అధిగమించడానికి, స్త్రీ తన ఆహారంలో పాలు ఇంకా పెరుగును చేర్చుకోవాలి.అందుకే రోజూ ఒక గ్లాసు తక్కువ కొవ్వు పాలు తాగాలి. ఇది కాకుండా లంచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా పెరుగు అన్నం తినండి.చలికాలంలో మఖానా, పసుపు, లవంగాలు ఇంకా యాలకులు మొదలైనవి వేసి పాలు తాగాలి.
ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. దీని కోసం మీరు మీ ఆహారంలో పండ్లు ఇంకా కూరగాయలను చేర్చుకోవాలి. అలాగే పీచు పండ్లను ఇంకా సలాడ్ తినండి. ఇది కాకుండా పప్పులు, బీన్స్, పచ్చిమిర్చి, స్ట్రాబెర్రీలు ఇంకా అలాగే చిలగడదుంపలు మొదలైన వాటిని ఆహారంలో చేర్చుకోని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: