కొవిడ్‌తో కోమాలోకి.. వ‌యాగ్రా ట్రీట్‌మెంట్ ఇవ్వ‌డంతో..!

Paloji Vinay
వైద్య శాస్త్రంలో ఇది మిరాకిల్ అనే ప‌దాలు చాలా సీనిమాల్లో చూస్తుంటాం.. ఇదే క్ర‌మంలో కొన్ని సంద‌ర్భాల్లో నిజజీవితంలో ఇది నిజం అవుతుంటాయి. అలాంటి అద్భుతం బ్రిట‌న్‌లో వెలుగుచూసింది. కొవిడ్‌-19 కార‌ణంగా 37 ఏళ్ల మ‌హిళ కోమాలోకి వెళ్లింది. ఆమెకు ఎన్ని ర‌కాల చికిత్స అందించినా.. కోలుకోలేక‌పోయింది. దీంతో వైద్యులు ప్ర‌యోగాత్మ‌క విధానంలో ఆ మ‌హిళ‌ల‌కు ట్రీట్‌మెంట్ అందించారు. చికిత్స‌లో భాగంగా మ‌హిళ‌కు వైద్యులు వ‌యాగ్రా ను ఇచ్చారు. దీంతో 45 రోజులుగా ప్రాణాల‌తో పోరాడిన మ‌హిళ కోలుకోవ‌డంతో.. వ‌య‌గ్రా ట్రీట్‌మెంట్ ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.

 లింక‌న్ షైర్‌కు చెందిన 37 ఏళ్ల వ‌య‌స్సున్న  మోనికా ఆల్మేడా న‌వంబ‌ర్ 9న క‌రోనా వైర‌స్ భారిన ప‌డింది. దీంతో  ఆమెను అస్ప‌త్రిలో చేర్పించారు. అయితే, ఆమె రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న‌ప్ప‌టికి వైర‌స్ భారిన ప‌డింది. రుచి, వాస‌న కోల్పోయిన మోనిక‌కు ద‌గ్గుతూ ర‌క్తం రావ‌డంతో కోమాలోకి వెళ్లింది. ఆమెను ఐసీయూకు త‌ర‌లించిన వైద్యులు చికిత్స అందించారు. ఈ క్ర‌మంలో ప్ర‌యోగాత్మ‌కంగా వ‌యాగ్రా ఇచ్చిన త‌రువాతే ఆమే విష‌య‌మ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డింద‌ని, త‌న శ్వాస‌నాళాలు తెర‌వ‌డానికి, సులువుగా శ్వాస తీసుకోవ‌డానికి వ‌యాగ్రానే ఉప‌యోగ‌ప‌డిందిని మోనిక వివ‌రించింది.

   `సిల్డెనాఫిల్‌` (వ‌యాగ్ర‌) తీసుకున్న 48 గంట‌ల్లోనే ఊపిరితిత్తులు స్పందించాయి. వైద్యులు కూడా 72 గంట‌ల్లో వెంట‌లేట‌ర్‌ను ఆఫ్ చేస్తున్నామ‌ని త‌న కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచార‌మిచ్చిన‌ట్టు మోనిక పేర్కొంది. 37 సంవ‌త్స‌రాల  వ‌య‌సులోనే చ‌నిపోయేదాన్ని , కానీ మొండిగా పోరాడ‌న‌ని, తాను న‌ర్సింగ్ వృత్తిని ప్రారంభించిన లింక‌న్ కౌంటి హాస్పిట‌ల్ నే అడ్మిట్ చేశార‌ని చెప్పారు. త‌నను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేశార‌ని, ఆస్ప‌త్రి సిబ్బందికి జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాన‌ని మోనిక భావోద్వేగానికి గుర‌య్యారు. అయితే, క‌రోనా చికిత్స కోసం ప‌లు ర‌కాల వైద్య విధానాలు తెర‌మీద‌ర‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో వైద్య శాస్త్ర‌వేత్త‌లు, నిపుణులు మ‌రిన్ని ప్ర‌యోగాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: