ఆ క్రియ పక్క దారి పడుతోందా

D.V.Aravind Chowdary


యోగ ఆరోగ్యం కొరకనేది ఎక్కడా చెప్పలేదు. కాని ఇప్పుడది వీధి వ్యాపార ఆకర్షణ అయింది. ఇందులో చిలువలు పలవలుగా యోగాలు ఎన్నో పేర్లతో తలెత్తాయి.
భారతీయ యోగ దర్శనాలు 6  మోక్ష మార్గాలుగా వున్నాయి. ఒక మార్గం మరొక మార్గానికి అనుసంధానం లేకపోవడం గనుకనే వేర్వేరు మార్గాలుగా కొనసాగుతున్నాయి. యోగ అనే క్రియ లో  ఆసనాలు  ఒక భాగం. యోగలో మోక్ష సాధనకు కొన్ని మార్గాలు చెప్పారు.ఆ సాధనలో ఆసనాలు ఒక మెట్టు మాత్రమే. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరకు మోక్షం సాధించాలి.ఇది యోగ దర్శన సారాంశం. దీనికి ఆద్యుడు పతంజలి.

యోగ వ్యక్తిగతం అని మూలంలో చెప్పారు. నేడది బృహత్తర పరిశ్రమగా తలెత్తింది. రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ లో తలతిరిగే అసత్యాలు వ్యాపింపజేస్తున్నది. ప్రపంచం అంత మౌతుందనేది అందులో ఒకటి. సాంఖ్య, యోగ, వైశేషిక, న్యాయ పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస అనే ఆరు దర్శనాలువుండగా, యోగ ఒకటి అని గ్రహించాలి. హఠయోగం, తాంత్రికయోగం మొదలైనవి అక్కడక్కడా కొందరు స్వీకరించారు. వీటిలో తాంత్రిక యోగంలో సెక్స్ దృష్ట్యా అస్సాం, కేరళ, గుజరాత్ లలో నిషేధానికి గురైంది.

యోగలో భాగంగా కొందరు సూర్య నమస్కారాలు, అందలి ఆసనాలు బోధిస్తున్నారు.చిత్త వృత్తి నిరోధం యోగానికి ప్రధానం. ఆలోచన చంపేస్తే మనిషికి యోగ
పడుతుంది. కాని మానవ లక్షణాలలో అతి విశిష్టమైనది ఆలోచనే  అమానుషం. దేశంలోని అన్నీ  యోగ స్కూళ్ళలో ఎక్కడా, మూల దర్శనం ప్రకారం మోక్ష ప్రస్తావన తీసుకురావడం లేదు. అలాగంటే, నేటి తరం వారు రారేమోనని అనుకోని వుండొచ్చు. కనుక చిట్కా యోగాలే కేంద్రాలుగా తలెత్తి, వాణిజ్యరంగాలుగా మారాయి.

ఆరోగ్యానికి వ్యాయామం చేయడం డాక్టర్లు చెబుతారు. యోగను కొందరు అంత వరకే పరిమితం చేయడం బాగుంది. విదేశాలకు ప్రాకిన యోగలో దీపక్ చోప్రా వంటి వారు
అక్కడ కూడా సైన్స్ పదజాలంతో మోసగిస్తుండగా మహేష్ యోగి వంటి వారు కొత్త పేర్లతో ఆకట్టుకున్నారు. కామిగాని వాడు మోక్షగామిగాడయా అనే సూత్రాన్ని
రజనీష్ చక్కగా పాటించి, పోయారు. ఇందిరాగాంధికి యోగా గురువు మరియు అత్యంత  సన్నిహితుడైన ధీరేంద్ర బ్రహ్మచారి ఏకంగా వేల కోట్ల సామ్రాజ్యాన్ని  నెలకొల్పాడు.

ఇప్పుడు రాందేవ్ యోగం మొదలెట్టి ఏకంగా కేన్సర్ నయం చేస్తానంటున్నాడు. ఆయన్ను ఆరోగ్యశాఖ ఖండించింది. యోగ చేసిన రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి
కేన్సర్ తో చనిపోయారు. 38 ఏళ్ళకే చనిపోయిన వివేకానంద యోగ సరిగా చేయలేదా?


ReplyForward

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: