మహిళలకు కొబ్బరినూనె ఎంత మేలో తెలుసా?

Purushottham Vinay
ఆడవారికి తల్లిగా మారడం ఒక అందమైన అనుభూతి. కానీ గర్భధారణ సమయంలో ఆడవాళ్లు చాలా దశలను దాటవలసి ఉంటుంది.వారు ప్రతి అలవాటును కూడా మార్చుకోవాలి.వారు ఏం తినాలి ఇంకా ఏ వైపు పడుకోవాలి అలాగే ఎంత తినాలి ఇలా అన్నీ జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని చిన్న చిన్న టిప్స్‌ కనుక పాటిస్తే వారి కష్టాలు కొంతమేరకు తగ్గుతాయి.అందులో కొబ్బరినూనె వారి అనేక సమస్యలకు చక్కటి పరిష్కారమని చెప్పవచ్చు. గర్భధారణ సమయంలో కొబ్బరి నూనెను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.ఆహారంలో కొబ్బరి నూనెను ఉపయోగించడం వల్ల నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నమ్ముతారు.అలాగే దీంతో పాటు కొబ్బరి నూనె నుంచి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి. దీన్ని ఎప్పుడూ కూడా తీసుకోవడం వల్ల పుట్టిన బిడ్డకు వెంట్రుకలు బాగుంటాయని ఇంకా అలాగే గర్భిణికి కూడా జుట్టు రాలిపోయే పరిస్థితి ఎదురవదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇక అంతేగాక గర్భిణీల ప్రధాన ఆందోళనలలో స్ట్రెచ్ మార్క్స్ ఒకటని చెప్పాలి.

గర్భధారణ తర్వాత స్ట్రెచ్ మార్క్‌లను తొలగించడానికి ఆడవాళ్లు అనేక రకాల విధానాలను ఉపయోగిస్తారు. కానీ వారు మాత్రం ఆశించిన ఫలితాలను పొందలేరు. అయితే కొబ్బరి నూనె సహాయంతో మీరు చాలా వరకు స్ట్రెచ్ మార్క్స్ గుర్తులను ఈజీగా వదిలించుకోవచ్చు. వారు ప్రతిరోజు పొట్టపై మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఇక ఈ విధంగా చేస్తే గర్భధారణ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ గుర్తులను తొలగించడంలో కొబ్బరినూనె ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది.ఆయిల్ పుల్లింగ్ ని కొబ్బరి నూనెతో చేసే మౌత్ వాష్ అంటారు. గర్భధారణ సమయంలో కనుక రుచి కోల్పోతే కొబ్బరి నూనెతో పుక్కిలించడం మంచిది. ఇలా చేయడం వల్ల స్త్రీల మూడ్ చాలా బాగవుతుంది. ఇతర ఆహారాలను కూడా తినడానికి వారు ఇష్టపడుతారని వైద్యనిపుణులు చెబుతున్నారు.

ఇక గర్భధారణ సమయంలో దాదాపు 25 శాతం మంది ఆడవాళ్లల్లో అలర్జీ సమస్య ఉంటుంది. మీరు గర్భధారణకు ముందు కనుక ఈ అలెర్జీని కలిగి ఉంటే గర్భధారణ సమయంలో మీకు వచ్చే అవకాశాలు మరింత పెరుగుతాయి. శరీర దురదను తగ్గించడానికి డాక్టర్ లేదా నిపుణుడి సలహా తీసుకోవడం చాలా మంచిది. అయితే శరీరానికి స్నానం చేసిన తర్వాత కొబ్బరినూనెను కనుక రాసుకుంటే దురద నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ఇక అంతేకాదు పరుపు ఇంకా బెడ్‌ను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. వారానికి ఒకసారైనా సరే బెడ్‌ షీట్లను ఖచ్చితంగా వేడి నీటితో ఉతకాలి. ఇంకా కిటికీలు తలుపులను ఖచ్చితంగా మూసిఉంచాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: