డెల్మీక్రాన్ : ఇప్పుడొక వింత వేరియంట్ ? ఎందుకంటే !

RATNA KISHORE

ఒక వేరియంట్ నియంత్ర‌ణ‌కు నోచుకోక‌ముందే,ఒక వేరియంట్ కు సంబంధించి అధ్య‌య‌నం పూర్తి కాక‌మునుపే క‌రోనా ఉత్ప‌రివ‌ర్త‌నాలు అన్న‌వి వేర్వేరు రూపాల‌లో భ‌యం మ‌రియు ఆందోళ‌న‌ను క‌లిగిస్తూనే ఉన్నాయి. ప్ర‌స్తుతం యూఎస్, యూకేల‌లో ఈ సూప‌ర్ స్ట్రెయిన్ ప్ర‌భావం ఎక్కువ‌గానే ఉంద‌ని, దీనిపై మ‌రింత అప్ర‌మత్తం అవ‌స‌రం అని ప‌రిశోధ‌న బృందాలు అంటున్నాయి. మ‌న దేశంలో ఒమిక్రాన్ కు సంబంధించి ఇప్ప‌టికే ఆందోళ‌నక‌ర రీతిలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. నైట్ క‌ర్ఫ్యూ తో  మ‌రియు రానున్న నూత‌న వేడుక‌ల‌ను ర‌ద్దు చేయ‌డంతో ఈ మ‌హ‌మ్మారి నుంచి దూరం కావాల‌న్న‌ది ఓ ఆలోచ‌న‌గా ప్ర‌భుత్వంకు ఉంది. కానీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాల వ‌ద్ద సంబంధిత ప‌రీక్ష‌లు ఉన్నా త‌రువాత  సంబంధిత ప్ర‌యాణికులు ఇళ్ల‌కు చేరుకున్నాక క‌రోనా ల‌క్ష‌ణాలు ఒక్క‌సారిగా వెలుగు చూస్తున్నాయి. క‌నుక తాజా వేరియంట్ వ్యాప్తి పై మ‌ళ్లీ ఆందోళ‌న రేగిన త‌రుణాన మ‌ళ్లీ అంత‌ర్జాతీయ స్థాయి విమానాశ్ర‌యాల‌పై, సంబంధిత ప్ర‌యాణికులపై నియ‌మ నిబంధ‌న‌లు క‌ఠిన‌త‌రం చేయ‌డం అత్య‌వ‌స‌రం. ఆవ‌శ్య‌కం కూడా!

డెల్మీ క్రాన్
ఆగ‌కుండా ద‌గ్గు
తీవ్ర‌మ‌యిన జ్వ‌రం
వాస‌న కోల్పోవ‌డం
వంటివి ఈ వేరియంట్ ల‌క్ష‌ణాలు అని చెబుతోంది వైద్య శాస్త్రం

ఒమిక్రాన్ వేరియంట్ ల‌క్ష‌ణాలు, అదేవిధంగా అది క‌లిగించే మ‌ర‌ణాలు ప్ర‌పంచ దేశాల‌ను  లాక్డౌన్ దిశ‌గా న‌డిపిస్తున్న త‌రుణాన పౌరులంతా మ‌రోమారు నియ‌మిత నిర్బంధంలోకి వెళ్లాల‌ని వ‌స్తున్న స‌మాచారం ఎంత‌గానో క‌ల‌వర‌పెడుతోంది. దీంతో ఒమిక్రాన్ కు సంబంధించి ప‌రీక్ష‌లు, వ్యాధి సోకేందుకు వీల‌యిన సంద‌ర్భాలు  అదేరీతిన సంబంధించిన చికిత్స పై ఇంకా కొన్ని ప‌రిశోధ‌న‌లు మిగిలే ఉన్నాయి. ఇప్ప‌టికే బూస్ట‌ర్ డోస్ కు సంబంధించి ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ న‌డుస్తోంది. వ్యాధి నిరోధ‌క‌త అన్న‌ది రెండు ద‌ఫాలుగా టీకాలు పొందిన వారికి ఉంటుంద‌ని, త‌రువాత వ‌య‌సు మ‌ళ్లిన వారిలో ఆ స్థాయిలో ఉండ‌డం క‌ష్ట‌మ‌ని, అందుకే  అనుకున్న స్థాయిలో వ్యాధిపై (ఏ వేరియంట్ అయినా స‌రే) పోరాడాలంటే మ‌రో డోసు త‌ప్ప‌ద‌న్న వార్త‌లు వ‌స్తున్న త‌రుణాన పాత వేరియంట్ (ఒమిక్రాన్) కు సంబంధించి స్ప‌ష్ట‌మ‌యిన నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌లు వైద్య శాస్త్రం తీసుకోక ముందే మ‌రో ఉప‌ద్ర‌వం నెత్తిన వ‌చ్చి ప‌డ‌డంతో  సంబంధిత నిపుణులు ఉలిక్కిప‌డుతున్నారు.
ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనాకు సంబంధించి మ‌రో కొత్త వేరియంట్ పుట్టుకు వ‌చ్చింద‌ని వైద్య బృందాలు చెబుతున్నాయి. ఇప్ప‌టికే ఒమిక్రాన్ తో వ‌ణికిపోతున్న ప్ర‌పంచానికి కొత్త వేరియంట్  ఎటువంటి స‌వాళ్లు విస‌ర‌నుందో అన్న ఆందోళ‌న‌లు వినిపిస్తున్నాయి. డెల్టా వేరియంట్, ఒమిక్రాన్ వేరియంట్ క‌లిస్తే తాజాగా వచ్చిన వేరియంట్ అని వైద్య బృందాలు తెలిపాయి. ఈ నేప‌థ్యంలో మరొక్క‌సారి అప్ర‌మ‌త్తం కావాల‌ని అంటున్నారు ప‌రిశోధ‌కులు. ఇదొక వింత వేరియంట్ అని చెబుతూ, ఎప్ప‌టిలానే జాగ్ర‌త్త‌లు ప‌దే ప‌దే హెచ్చ‌రికలు జారీచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: