పిల్లలు అకారణంగా నవ్వుతున్నారా.. జాగ్రత్త.. మూర్ఛ కావచ్చు?

praveen
సాధారణంగా చిన్న పిల్లలు ఏం మాట్లాడినా ఎంతో ముద్దు ముద్దుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది చిన్నపిల్లలు ఒక్కసారి చిరునవ్వు చిందించారు అంటే ఎవరి మనసైన పులకరించి పోతూ ఉంటుంది. ఇక చిన్నారులను నవ్వించడానికి ఎంతో మంది చిన్న పిల్లలా మారిపోయి ఆడుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది చిన్నారులు ఎవరు నవ్వించకపోయినప్పటికీ తమలో తామే నవ్వుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు.  అయితే ఇది చూసిన తల్లిదండ్రులు ఎంతో మురిసి పోతూ ఉంటారు. మా పిల్లవాడు ఎంత ముద్దుగా నవ్వుతున్నాడో అని అనుకుంటూ ఉంటారు. కానీ పిల్లలు ఒంటరిగా కూర్చొని నవ్వుతున్నారు అంటే దానిని లైట్ తీసుకోవద్దు అంటూ నిపుణులు సూచిస్తున్నారు.

 నవ్వు నాలుగు విధాల చేటు చేస్తుంది అని చెబుతూ ఉంటారు. ఇక్కడ చిన్నారుల నవ్వు కూడా ఎంతో ప్రమాదకరమైనది అని అంటున్నారు నిపుణులు. ఎలాంటి కారణం లేకుండా పిల్లలు ఒంటరిగా కూర్చుని అదేపనిగా నవ్వుతూ ఉంటే తల్లిదండ్రులు వెంటనే జాగ్రత్త పడాలని వైద్యులు సూచిస్తున్నారు.. మూర్చ వ్యాధి లో ఇదోరకం అంటూ చెబుతున్నారు నిపుణులు. ఇది చాలా అరుదుగా పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది అని.. రెండు లక్షల మందిలో ఒకరు మాత్రమే ఈ అసాధారణ వ్యాధితో బాధపడుతూ ఉంటారు అని  ఎల్బీనగర్లోని కామినేని ఆసుపత్రికి చెందిన కన్సల్టెంట్ సర్జన్ రమేష్ చెప్పుకొచ్చారు. ఇటీవల ఇదే సమస్యతో బాధపడుతున్న మూడేళ్ల చిన్నారికి సర్జరీ చేసినట్టు చెప్పుకొచ్చారు.

 మెదడులోని హైపోథాలమస్ అనే భాగం ఉంటుంది. ఇది ఎంతో కీలకమైనది అంటూ తెలిపారు. ఆ ప్రాంతంలో కణితి ఏర్పడితే పిల్లలు గెలస్టిక్ సీజర్స్ బారిన పడతారని డాక్టర్ రమేష్ చెప్పుకొచ్చారు.. ఎప్పుడు పడితే అప్పుడు కారణం లేకుండా నవ్వుతూ ఉంటారని తెలిపారు. ఇక ఇటీవలే సర్జరీ చేసిన బాలికలో ఆరు నెలల క్రితం ఇలాంటి సమస్యను గుర్తించి వెంటనే తల్లిదండ్రులు వైద్యులను  ఆశ్రయించడంతో ప్రమాదం తప్పింది అని డాక్టర్ రమేష్ తెలిపారు. ఎవరిని గుర్తు పట్టకపోవడం రానురాను బాలిక ఎడమ కంటి లో మెల్ల రావడం లాంటివి కూడా జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే హైపోథాలమస్ భాగంలో కణితి ఉన్నట్టు గుర్తించి విజయవంతంగా శస్త్ర చికిత్స చేసినట్టు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: