ఒమిక్రాన్ : భార‌త్‌లో బూస్ట‌ర్ డోస్ గా ఏది ఇవ్వ‌బోతున్నారు..?

N ANJANEYULU
ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతంగా విజృంభిస్తోంది. దీంతో ప్ర‌పంచ దేశాలు ఇప్ప‌టికే అప్ర‌మ‌త్త‌మ‌వుతూ ఉన్నాయి. కొన్ని దేశాలలో అయితే రెండ‌వ డోస్ పంపిణీ చేయ‌డంలో వేగాన్ని పెంచాయి. అదేవిధంగా మ‌రికొన్ని దేశాల‌లో మూడ‌వ డోస్ పంపిణీ చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసాయి. అయితే ఇజ్రాయిల్ దేశ ప్ర‌భుత్వం అయితే ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కొవ‌డానికి ఏకంగా నాలుగ‌వ డోస్ పంపిణీ చేసేందుకు సిద్ధ‌మైంది.

ఇజ్రాయిల్‌లోన 150 మంది వైద్య సిబ్బందికి ఫైజ‌ర్ వ్యాక్సిన్‌ నాలుగ‌వ డోస్‌ను  అందించింది. ఇజ్రాయిల్‌లో నాలుగో డోసు తీసుకున్న 150 మంది వైద్య సిబ్బంది ఆరోగ్యంగా ఉండి.. వారు ఓమిక్రాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొగలిగితే  ఆ దేశ ప్రజలందరికీ సత్వరమే నాలుగో డోసు ఇస్తామని ఇజ్రాయిల్‌ ప్రభుత్వ వర్గాలు ప్ర‌క‌టించాయి.  అక్క‌డ  ఈ ఏడాది ఆగ‌స్టులోనే మూడో డోసును ప్రజలకు పంపిణీ చేశారు. ఇక నాలుగో డోసు పంపిణీ చేయ‌డానికి ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ త్వరలో నిర్ణయం తీసుకోనున్న‌ది.
ఇదిలా ఉండ‌గా.. భార‌త్‌లో రోజు రోజుకు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండ‌టంతో థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న త‌రుణంలో బూస్ట‌ర్ డోస్‌లు ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ది. జ‌న‌వ‌రి 10, 2022  నుంచి 60 ఏండ్లు దాటిన వారికి బూస్ట‌ర్ డోస్‌లు ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. ముఖ్యంగా బూస్ట‌ర్ డోస్‌లుగా ఏ వ్యాక్సిన్‌ను ఇవ్వ‌బోతున్నార‌న్న దానిపై మాత్రం కేంద్రం క్లారిటీ ఇవ్వాల్సి ఉన్న‌ది.
మ‌క్సింగ్‌, మ్యాచింగ్ ప‌ద్ద‌తిలో డోస్ ఉంటుందా లేదంటే గ‌తంలో ఇచ్చిన కొవాగ్జిన్ లేదా కోవీషీల్డ్ వాక్సిన్‌ను ప్రికాష‌న్ డోస్‌గా ఇస్తారా అనేది చూడాలి మ‌రీ. ఒక వేళ కోవీషీల్డ్ లేదా కొవాగ్జిన్‌ను ప్రికాష‌న్ డోస్‌గా ఇస్తే త‌ప్ప‌నిస‌రిగా మూడ‌వ డోస్‌కు 9 నుంచి 12 నెల‌లు గ్యాప్‌లో ఇవ్వాలి.  ఈ రెండు వ్యాక్సిన్ల మ‌ధ్య విరామం అదేవిధంగా ఉండ‌డంతో మూడ‌వ డోస్ ఉండే అవ‌కాశం ఉన్న‌ది. ముఖ్యంగా బూస్ట‌ర్ బోస్ ఏమి ఇవ్వ‌బోతున్నార‌నేది త్వ‌ర‌లోనే ఓ కొలిక్కి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: