అలాంటి సమస్యలు ఉన్నవారు వీటిని అసలు తినకూడదట..!

Divya
మనకి ఎక్కువగా అందుబాటులో ఉండే కాయగూరలలో.. క్యాబేజీ కూడా ఒకటి. ఇక ఇది ప్రదేశాలను బట్టి మారుతూ, విభిన్నమైన రంగులలో ఉంటుంది. మన ప్రాంతాలలో అయితే ఎక్కువగా గ్రీన్ కలర్ ఉండే క్యాబేజి ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ పండిన కూడా క్యాబేజీ మాత్రం మనకు ఆరోగ్యప్రయోజనాలను ఇస్తుంది. ఎక్కువగా పకోడీ, ఫ్రై వంటి కూరలను చేసుకునేందుకు ఈ క్యాబేజీ బాగా ఉపయోగపడుతుంది. ఏదైనా సూప్ వంటివాటిలో చేసుకునేటప్పుడు ఈ క్యాబేజీని కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే వీటిని ఎవరు తినకూడదో ఇప్పుడు మనం చూద్దాం.
ఇందులో ముఖ్యంగా విటమిన్స్ విషయానికి వస్తే..B1,B6,B2, విటమిన్లతోపాటు C,K, క్యాల్షియం , పొటాషియం, వంటి పోషకాలు క్యాబేజీలో లభిస్తాయి.ఇక ఆరోగ్యానికి ఎంత సహాయ పడతాయో.. చర్మసౌందర్యాన్ని పెంచేందుకు కూడా అంతే సహాయపడుతుంది. ముఖ్యంగా క్యాన్సర్ వంటి రోగాన్ని నిరోధించడానికి ఇది ముఖ్య పాత్రగా పోషిస్తుంది. ఇక ఈ క్యాబేజీ ఆకులను, ఆకు రసాన్ని తాగిన ఎంతటి దగ్గు అయినా చిటికెలో తగ్గిపోతుంది. ఇక అంతే కాకుండా ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ.. వల్ల అలర్జీ, నొప్పులు, వాపులను తగ్గించేలా చేస్తుంది. ఇక అంతే కాకుండా ఏదైనా గాయం తగిలినప్పుడు కూడా అవి త్వరగా మానేందుకు చాలా సహాయపడుతుంది క్యాబేజీ.
క్యాబేజీని బాగా తినడం వల్ల వయసు ఎక్కువగా కనిపించదట. అంతేకాకుండా మన శరీరంలో ఉండే వేస్ట్ పదార్ధాన్ని కూడా బయటికి పంపించేందుకు బాగా సహాయపడుతుంది. అయితే క్యాబేజీని ఎక్కువగా తినడం వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతాయని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు క్యాబేజీని అసలు తినకూడదట. అంతే కాకుండా గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు ఉన్నవారు వీటిని అసలు తినకూడదు.. ఎందుచేత అంటే అవి మరింత ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి. ముఖ్యంగా జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడే వారు అసలు తినకూడదట. ఏదైనా శస్త్ర చికిత్స చేయించుకున్న వారు కూడా వీటిని తినకపోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: