ఎమోషనల్ ఈటింగ్ అంటే ఏమిటో తెలుసా..!

MOHAN BABU
ఏదో ప్రాబ్లం గురించి ఆలోచిస్తూ ఫ్రిజ్ డోర్ తీస్తే ఆటోమేటిక్ చేయి చాకోబార్ ని అందుకుంటుంది. ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసే ముందు అయినా సరే,ఫ్రెండ్ ఎవరైనా పిజ్జా ఆఫర్ చేస్తే మొత్తం తినేయాల్సిందే. ఆకలి ఉండదు, కానీ అలా తినడానికి రెడీ అవుతారు. ఒంటరిగా ఉండటాన్ని లైక్ చేసే వాళ్ళు ఇష్టమైన ఫుడ్ ని చాలాసార్లు తింటారు. ఇలా తినడం వల్ల వాళ్లకు కొంచెం హ్యాపీనెస్ అందుతుందట.ఏదో  ఓదార్పు దొరికినట్లు ఫీలవుతారు. అయితే తినడానికి ఒక టైం అంటూ ఫాలో అవకపోవడం వల్ల ఫ్యాట్ పెరిగిపోతుంది. ఎమోషనల్ ఈటింగ్ ఎక్కువ అయితే బరువు పెరగడం వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ ఎమోషనల్ ఈటింగ్ కి అసలు ఎలా అడిక్ట్ అవుతారు. కొందరు వాళ్ళ హ్యాబిట్స్ వల్ల ఎమోషనల్ ఈటింగ్ కి అలవాటు పడతారు.

 రోజు ఆఫీస్ అయిపోగానే ఇంటికి వెళ్తూ చాక్లెట్, ఐస్ క్రీమ్స్ తినడం ఈ రకమే. లైఫ్ లో ఎక్కువ టైం మెంటల్ ప్రెజర్ లోనే ఉంటున్నాం. బోర్ కొడితే సోషల్ మీడియాలో లాగిన్ కావడం, పనిలోపనిగా స్నాక్స్ తినడం. ఇలా బోర్ ఫీలింగ్ కూడా ఎమోషనల్ ఈటీంగ్ కు ఫోకస్ అయ్యేలా చేస్తుంది. ఫ్రెండ్స్ తో కలిసి తిరిగేటప్పుడు పిజ్జాలు,బర్గర్లు,కూల్డ్రింక్స్ లాంటివి అవాయిడ్ చేయడం కష్టమైపోయింది. ఒక్కోసారి ఇష్టం లేకపోయినా ఫుడ్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది.ఇది కూడా ఒక రకమైన స్ట్రెస్ ఈటింగే. ఒక్కోసారి బాగా అలసిపోయినప్పుడు ఏ ఇన్స్పిరేషన్ దొరకనప్పుడు కూర్చొని ఏది దొరికితే అది తింటుంటారు.ఆ మెంటల్ స్టేట్  కి రికవరీ దొరికేవరకు ఎమోషనల్ ఈటింగ్ ఆగదు.

అయితే దీన్ని అరికట్టాలంటే ఫుడ్ తినే విషయంలో కరెక్ట్ టైం ఫాలో అవ్వాలి. అవసరమైతే ఓ పేపర్ నోట్ రాసుకుని ఆకలి ఎప్పుడెప్పుడు అవుతుందో చెక్ చేసుకోవాలి. కోపంలో లేదా టెన్షన్ వున్నప్పుడు ఆకలవుతుంటే గమనించి నోట్ చేయాలి. బోర్ కొట్టినప్పుడు వెంటనే ఫ్రెండ్ కి కాల్ చేసి ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకుంటే మంచిది. కథలు,కవితలు రాయడం,జాగింగ్,బుక్ రీడింగ్, యోగా వంటివి ఎమోషనల్ ఈటింగ్ నుంచి బయట పడేందుకు బాగా హెల్ప్ అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: