తల్లికి పాజిటివ్.. పిల్లలు పాలు తాగొచ్చా?

praveen
కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత మనిషి ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. శర వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో అందరిలో  కొత్త కొత్త భయాలు  మొదలయ్యాయి అని చెప్పాలి. ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయంపై ప్రతి సారి ఎంతోమంది అయోమయం లోనే మునిగిపోయేవారు. ఏదైనా పొరపాటు చేస్తే కరోనా వైరస్ పంజా విసిరి ప్రాణాలు తీస్తుందో అని భయపడేవారు. ముఖ్యంగా కరోనా వైరస్ బారిన పడిన తల్లి పిల్లలకుపాలు ఇవ్వవచ్చా లేదా అన్న దానిపై మాత్రం ఎంతో మంది లో ఎన్నో రకాల సందేహాలను నిండిపోయాయి అని చెప్పాలి.

 ఒకవేళ తల్లి కరోనా వైరస్ బారిన పడితే ఇక పిల్లలను వైరస్ నుంచి రక్షించుకోవడం ఎలా అన్నది కూడా ఎంతో మందికి చిక్కు వీడని ప్రశ్న గా మారిపోయింది. ఇక ఇప్పుడు ఓమిక్రాన్  వైరస్ అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో మరోసారి ఇలాంటి ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి.. దేశవ్యాప్తంగా చాపకింద నీరులా పాకిపోతోంది ఓమిక్రాన్ వేరియంట్. ఈ క్రమంలోనే ప్రస్తుతం అందరిలో ఎన్నో సందేహాలు పెరిగిపోతున్నాయి.  తల్లి  వైరస్ బారిన పడితే పుట్టిన పిల్లలను కూడా  వైరస్ పాజిటివ్ వస్తుందా.. వైరస్ సోకిన తల్లిపాలు తాగిన పిల్లలకు కూడా కరోనా సంక్రమిస్తుందా అనే సందేహాలు ఎంతోమందిలో ఉన్నాయి.

 అయితే ఇదే విషయంపై ఎంతో మంది డాక్టర్లను సలహాలు కూడా అడుగుతు ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే  ఇటీవల టీకా తీసుకోవడానికి ముందు కరోనా వైరస్ బారిన పడిన గర్భిణీల పై ఆరు నెలల పాటు అధ్యయనం చేయగా ఆసక్తికర విషయం బయటపడింది. అధ్యయనంలో 55 శాతం మంది ప్రసవం జరిగిన పది రోజుల్లోనే  వైరస్ బారిన పడ్డారు.. అయితే వారికి పుట్టిన శిశువులకు కరోనా వైరస్ పరీక్షలు చేయగా నెగటివ్ వచ్చినట్లు తేలింది.. దీన్ని బట్టి చూస్తే  వైరస్ సోకిన తల్లిపాలు తాగిన శిశువులకు కరోనా వైరస్ సోకదు అనే విషయం నిర్ధారణ అయింది. దీంతో ఎంతోమంది తల్లులు ఎలాంటి అనుమానాలు అపోహలు పెట్టుకోకుండా పిల్లలకు తల్లిపాలు ఇవ్వవచ్చు అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: