ఒకే రోజు లక్ష కరోనా కేసులు.. ఎక్కడంటే..!

MOHAN BABU
కరోనా దీని పేరు వింటేనే మనిషి గుండెల్లో ఏదో తెలియని భయం. గత రెండు సంవత్సరాల నుంచి ప్రపంచ దేశాలను మహమ్మారి వణికిస్తోంది. దీని దాటికి ఎన్నో కుటుంబాలు, రోడ్డున పడ్డాయి. కొన్ని లక్షల కంపెనీలు మూతపడ్డాయి. ఎంతో మంది మృత్యువాత పడ్డారు. ఇంతటి విపత్కర పరిస్థితుల నుండి  ప్రజలు  ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో మళ్లీ ప్రపంచదేశాలను మార్పు చెందిన  ఈ మహమ్మారి ఒమిక్రాన్ పేరుతో మళ్లీ విజృంభిస్తోంది. మరి దీని ప్రభావం ఎంతవరకు ఉన్నదో  తెలుసుకుందాం..! అటు ఓమిక్రాన్,ఇటు కరోనా ప్రపంచదేశాలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఫ్రాన్స్ లో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఒకరోజు ఒక లక్షా 4వేల 611 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఫ్రాన్స్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

గత మూడు రోజుల నుంచి ఫ్రాన్స్ లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవు తున్నాయి. కరోనా కేసులు అత్యధికం అవుతున్నటువంటి నేపథ్యంలో ఆ దేశ ప్రెసిడెంట్ ఇమ్మానియేల్ కీలక అధికారులతో కోవిడ్ నివారణపై తీసుకోవాల్సిన చర్యలపై  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించనున్నారు. ఓమిక్రాన్ వేరియంట్ కూడా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బూస్టర్ డోసుకు కూడా ఫ్రాన్స్ అనుమతి ఇచ్చింది.

 రెండు డోసులు వేసుకొని మూడు నెలలు పూర్తయితే బూస్టర్ డోస్ తీసుకో వాలని ఆదేశించింది. బూస్టర్ డోస్ కు ప్రజలు అంగీకరిస్తేనే మొదటి, రెండు డోసు లకు సంబంధించి చెల్లుబాటు అయ్యేలా పాస్ లు జారీ చేయాలని  ఫ్రాన్స్ ప్రభుత్వం ఆలోచి స్తున్నట్లు తెలుస్తోంది. కేఫ్, రెస్టారెంట్లు, బహిరంగ ప్రదేశాలు, అంతర్జాతీయ రాకపోకలకు ఈపాస్ లను తప్పనిసరి చేయనుంది.  ఫ్రాన్స్ లో ఇప్పటివరకు కరోనాతో ఒక లక్షా 22వేల546 మంది మరణించారు. కరోనా వ్యాక్సినేషన్ 76.5 శాతం పూర్తయింది. ఈ కేసులను తగ్గించేందుకు నివారణ చర్యలు జరుగుతున్నాయని  ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: