శృంగారంలో పాల్గొని చాలా రోజులైందా.. ఇది తెలుసుకోండి?

praveen
ప్రతి ఒక్కరి జీవితంలో శృంగారం అనేది ఒక భాగం. అయితే ఒకప్పుడు శృంగారం అంటే ఒక బూతుగా మాత్రమే చూసే వారు. కానీ ఈ నేటి రోజుల్లో మాత్రం శృంగారం అనే దానిపై ప్రతి ఒక్కరూ అవగాహన వచ్చింది. దీంతో సెక్స్ విషయంలో ఉన్న అపోహలను వదిలేసి ఆస్వాదించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అయితే సెక్స్ అంటే కేవలం ఇద్దరి కలయిక మాత్రమే కాదని తరచూ శృంగారం చేయడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి అంటూ నిపుణులు చెబుతుంటారు.

 ఒత్తిడిని దూరం చేసే ఒక మంచి చిట్కా శృంగారం అంటూ ఉంటారు. అయితే నేటి రోజుల్లో శృంగారంపై ప్రతి ఒక్కరికి అవగాహన పెరిగి పోయింది. కానీ ఎందుకో శృంగారంపై ఆసక్తి తగ్గిపోతుంది చాలామందికి. ఉరుకుల పరుగుల జీవితంలో డబ్బులు సంపాదించాలనే ఆశతో ముందుకు సాగుతున్నారు తప్ప.. శృంగారం విషయంలో ఎవరూ కూడా అంతగా ఆసక్తి చూపించడం లేదు అన్నది ఇప్పటి వరకు నిర్వహించిన సర్వేలలో కూడా వెల్లడైంది. అయితే ఇలా శృంగారానికి దూరంగా ఉండటం మాత్రం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు అంటూ అటు నిపుణులు చెబుతుంటారు.

 మీ పార్టనర్ తో శృంగారం లో పాల్గొని చాలా రోజులు అయితే మాత్రం మీరు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే వారానికి కనీసం రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు సెక్స్ చేసే వారి కంటే తక్కువ సార్లు శృంగారం లో పాల్గొనే వారిలో గుండె జబ్బులు అధికం గా ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాకుండా ఒత్తిడిని కలిగించే హార్మోన్లు తగ్గిపోయి యాంగ్జైటీ కూడా దూరం అవుతుందట. అంతేకాకుండా ఒక నిరోధకశక్తి తగ్గిపోయి, నిద్రలేమి లాంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది అని నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: