ఇలా చేస్తే.. వీర్య కణాలు దెబ్బతింటాయట?

praveen
ఉరుకుల పరుగుల జీవితంలో నేటి రోజుల్లో మనిషికి ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం లేకుండా పోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతి మనిషి డబ్బు సంపాదించాలనే ఆశ తో ముందుకు సాగుతున్నారు.. ఆరోగ్యం గురించి ఆలోచించేందుకు కాస్త సమయం కూడా వెచ్చించడం లేదు. వెరసి ఇటీవల కాలంలో ఎంతోమంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఘటనలు వెలుగులోకి  వస్తున్నాయ్. ముఖ్యంగా మనిషికి నిద్ర అనేది ఎంతో కీలకమైనది. ఒక వ్యక్తి నిద్ర కు ఎంత టైం  కేటాయిస్తున్నాడు అనే దానిపైన ఒక మనిషి ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది.

 ఇటీవల కాలంలో మనిషి జీవితంలో నిద్ర అనేది లేకపోతే ఎంత బాగుండు అని ప్రతి మనిషి కోరుకుంటున్నాడు. నిద్ర అనేది లేకపోతే ఇక 24 గంటలు కూడా పనిచేయవచ్చు కదా అని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక నిద్ర పోవాల్సిన సమయంలో నిద్ర పోకుండా చేతులారా ఆరోగ్యానికి చేటు చేసుకుంటున్నాడు. దాదాపు ప్రతి మనిషి 7 గంటల నుంచి ఎన్ని గంటల వరకు ప్రతిరోజు నిద్ర పోవాలి అన్న విషయం తెలిసిందే. కానీ కనీసం ఎవరు కూడా నిద్రకు ఆరు గంటలు కూడా కేటాయించడం లేదు. దీంతో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

 మరికొంతమంది కావలసిన దానికంటే ఎక్కువ నిద్రపోతున్నారు. నిద్ర ఎక్కువైనా తక్కువైనా ఆరోగ్యానికి మంచిది కాదు  అనే విషయం తెలిసిందే. శరీరానికి నిద్ర ఎక్కువైనా తక్కువైనా ఆ ప్రభావం వీర్యకణాలపై పడుతుంది అంటున్నారు నిపుణులు. ఆరు గంటల కంటే తక్కువ 9 గంటల కంటే ఎక్కువ సేపు నిద్రపోయే వారిలో వీర్యం కణాలలో నాణ్యత తగ్గడాన్ని  నిపుణులు గుర్తించారట. 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోయే వారిలో వీర్యకణాల నాణ్యత ఎంతో బాగా ఉన్నట్లు ఒక అధ్యయనంలో తేలింది అని నిపుణులు చెబుతున్నారు.  ఆలస్యంగా నిద్రపోవడం విశ్రాంతి లేకపోవడం వల్ల కూడా వీర్యకణాలు దెబ్బతింటున్నాయట. అంతేకాదు పడుకునే రెండు గంటల ముందు భోజనం చేయాలట. అంతేకాదు మొబైల్ కూడా వాడకూడదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: