ఒమిక్రాన్ ప్ర‌మాదం ఎంత‌.. లాక్‌డౌన్ త‌ప్ప‌దా..?

Paloji Vinay
క‌రోనా ప్రారంభంలో ఎలాగైతే ప్ర‌పంచం భ‌య‌ప‌డిందో మ‌రోసారి అదే భ‌యం గుప్పిట్లోకి వెళ్తుందా..?మ‌రోసారి క‌రోనా పంజా విసురుతుంద‌నే సంకేతాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఆఫిక్రాలో ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ వెలుగు రావ‌డం. దీంతో ప్ర‌పంచ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కి ప‌డ్డాయి. దీంతో పాటు అంత‌ర్జాతీయ ప్ర‌యాణాల‌పై ఆంక్ష‌లు విధిస్తున్నాయి. అగ్ర‌రాజ్యం అమెరికా నాలుగు దేశాల‌పై ప్రయాణం నిషేధించింది. అయితే.. ఒమిక్రాన్ వేరియంట్‌ ప్ర‌మాద‌క‌ర‌మైందా ? మ‌రోసారి లాక్‌డౌన్ విధించే ప‌రిస్థితులు ఏర్పడుతాయా అనే సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి.

  అయితే.. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భిన్న‌మైంద‌ని  శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.   బి.1.1.529 వేరియంట్‌కు కు డబ్ల్యూహెచ్ఓ ఒమిక్రాన్ అని నామ‌క‌ర‌ణం చేసింది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో 77 , బోట్సావానాలో 4 కేసులు న‌మోద‌య్యాయి. అలాగే దక్షిణాఫ్రికా నుంచి హాంగ్‌కాంగ్ వ‌చ్చిన ఒ వ్య‌క్తికి ఈ వైర‌స్ సోకింది. ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ప్రాథమిక దశలో ఉంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా చాప కింద నిరులా ఒమిక్రాన్ వ్యాపించి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి.

 ఒమిక్రాన్ అసాధారణ స్థాయిలో ఉత్పరివర్తనాలు చెంద‌డమే..  ఈ వైర‌స్ అంటే ఆందోళ‌న భ‌యం క‌ల‌గడానికి ప్ర‌ధాన కారణంగా చెప్పుకోవ‌చ్చు. ఒమిక్రాన్ వేరియంట్‌లో మొత్తం 50 ఉత్పరివర్తనాలు చెంది.. స్పైక్ ప్రొటీన్లలో 30 కిపైగా మార్పులు జ‌రిగుతున్నాయి. అయితే, ఈ స్పైక్ ప్రోటీన్ మానవ కణజాలంలోకి కరోనా వైరస్ చొచ్చకు పోవ‌డానికి ప‌ని చేస్తుంది. గ‌తంలోనూ నూత‌న వేరియంట్లు ప్ర‌మాద‌క‌ర‌మ‌ని అనుకున్న పెద్ద‌గా ప్ర‌భావం క‌లిగించ‌లేవు. ఇప్పుడు తాజాగా ద‌క్షిణాఫ్రికాలో బ‌య‌ట‌ప‌డ్డ ఈ కొత్త వేరియంట్ తో ఆందోళ‌న‌లు పెరిగిపోతున్నాయి.


ఒమిక్రాన్ వేరియంట్ మాన‌వ నిరోధక శ‌క్తి నుంచి త‌ప్పించుకుని తిరుగే స్వ‌భావం ఉంద‌ని శాస్త్ర‌వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు. అయితే, ఒమిక్రాన్ వ్యాప్తి ప్రాథ‌మిక ద‌శ‌లోనే ఉండ‌డంతో.. వ్యాప్తి, రోగ నిరోధ‌క శ‌క్తి ప్ర‌భావంపై ఎలాంటి ప‌రిణామాలు నిర్ధార‌ణకు రాలేక‌పోతున్నారు. దీంతో పాటు వ్యాక్సిన్ల ప్ర‌భావం ఏ విధంగా ఉంటుందో తెలియ‌దు. ఒక వేళ డెల్టా వేరియంట్ లాగానే ఒమిక్రాన్ ప్ర‌భావం చూపితే  ప్ర‌పంచం మ‌రొక సారి లాక్‌డౌన్‌లోకి వెళ్లే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: