వంటకాల్లో టమాటకు బదులుగా ఇవి వాడితే.. చాలా..!

MOHAN BABU
కిలో టమాట 100 ఎప్పుడో దాటేసింది. ఎర్రగా ఉండే టమాట ధర మంటలు మండిస్తోంది. ఈ పరిస్థితుల్లో టమాటా కొనాలంటే భారంగా మారింది. కూర, రసం, సాంబార్, పచ్చడి, టమాట రైస్, బిర్యానీ ఇలా ఏది చేయాలన్నా టమాటా ఉండాల్సిందే. అటువంటిది వంటింట్లో టమాటా జాడే లేదు. ఏది వండినా టమాటా ఉండాల్సిందే.లేదంటే టేస్టు ఉండదు. మరి టమాటా అందనంత ధరలో ఉంది. టేస్ట్ లేని టమాటా కూర తినాల్సిందే నా. అంటే అదేం కాదు. దానికి ప్రత్యామ్నాయం ఉంది. కూరల్లో రుచి అదేవిధంగా టమాటా తో సమానమైన  పోషకాలను అందించే కొన్ని ప్రత్యామ్నాయాలు ఉండనే ఉన్నాయి. టమాటా లేదని ఎందుకు బెంగ మేముండగా అంటున్నాయి కొన్ని కూరగాయలు. క్యాప్సికం చూడడానికి భలేగా ఉంటుంది.

 రకరకాల రంగుల్లో ఎట్రాక్టివ్గా కనిపిస్తోంది. అంతేకాదు దీంట్లో అనేక న్యూట్రీషియన్స్, విటమిన్ ఏ,విటమిన్ సి, ఫైబర్, కెరోటినాయిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. క్యాప్సికం లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందని  పోషకాహార నిపుణులు తెలిపారు. టమాటా లో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది క్యాప్సికం లో కూడా ఉంటుంది. ఆసక్తికర విషయం ఏమిటంటే టమాటాల్లో కంటే రెడ్ క్యాప్సికం లో విటమిన్  సి ఎక్కువగా ఉంటుంది. ఉసిరిని ఆరోగ్యాన్ని ఇచ్చే సిరి అంటారు. ఉసిరిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సితో పాటు విటమిన్  బి1, బి2, బి3, బి5, బి6 అలాగే విటమిన్ ఈ కూడా సమృద్ధిగా ఉంటాయి. కాల్షియం లోపం తో బాధపడేవారికి ఐరన్ సమస్యలు తగ్గిస్తుంది. టమాటా గుజ్జు లా ఉంటుంది దీని కారణంగా తక్కువ టమాటాలతో మంచి ప్యూరీ తయారవుతుంది. టమాటా లో స్థానంలో పండిన  గుమ్మడి పండు ప్యూరీని వాడుకోవచ్చు. బంగారు రంగులో ఉండే గుమ్మడి పండు ఔషధాలు గని అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: