సుప్రీం : వారికి వాక్సిన్.. అలానే వేయాలి.. !

Chandrasekhar Reddy
దేశంలో వాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అయినా తాజా కరోనా పరిస్థితి నేపథ్యంలో మరోసారి మందకొడిగా సాగుతున్న ప్రాంతాలను మోడీ స్వయంగా పర్యవేక్షిస్తూ ఆయా జిల్లాలోనూ వాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచించారు. అలాగే ఇక వాక్సిన్ కేంద్రాలవరకు వచ్చి దానిని తీసుకోలేని వారి విషయం ఇప్పుడు చర్చకు వస్తుంది. అలాంటి వారికి వారి వద్దకే వెళ్లి వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించాలని తాజాగా సుప్రీం కోర్టు కలగజేసుకోవడంతో కేంద్రం ఆ దిశగా అడుగులు వేయడం ఆరంభించింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో ఈ తరహా ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. అంటే ఆయా రాష్ట్రాలలో ఇంటింటికి వెళ్లి వాక్సిన్ వేసుకొని వారిని కనిపెట్టి మరి వారికీ వాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేస్తున్నారు అధికారులు.

ఇక కదలలేక ఇంటిలోనే మంచాన ఉన్నవారికి తాజాగా వాక్సినేషన్ ప్రక్రియ పై సుప్రీం ఆదేశాల మేరకు కేంద్రం మార్గదర్శకాలు జారీచేసింది. దానిప్రకారంగా ఆయా రాష్ట్రాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీకా బృందాలు ఆయా వ్యక్తుల ఇంటివరకు వెళ్లి వారికీ వాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేయనున్నారు. సుప్రీం లో వికలాంగుల కోసం ఈ తరహా ఏర్పాట్లు చేయాలనీ ఒక ఎన్జీఓ దాఖలు చేసిన పిటిషన్ విచారించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.  తద్వారా దివ్యంగులకు, మంచాన ఉన్న వారికీ, తదితర వారికీ వాళ్ళ ఇంటివద్దనే టీకా కార్యక్రమం జరుగనుంది.

దీని కోసం ఆయా జాబితాలను సిద్ధం చేస్తున్నారు. వారికి పూర్తిగా వాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది లేనిది ఎప్పటికప్పుడు సమాచారం సేకరించేందుకు ఒక నోడల్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ జాబితాలో అందరికి టీకా అందించడం వీరి లక్ష్యం. జస్టిస్ ధనంజయ్ వై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్న లతో కూడిన ధర్మాసనం ఎన్జీఓ వేసిన పిటిషన్ ను విచారించి ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఇక కేంద్రం తరుపున వాదించిన భాటి 60 ఏళ్ళు పైబడిన వారికి ఇప్పటికే ఇంటివద్దనే టీకా ఇచ్చే ఏర్పాటు చేసినట్టు ధర్మాసనానికి స్పష్టం చేశారు.  కేవలం మే 27 నుండి సెప్టెంబర్ 27 వరకు 17.9 కోట్ల మందికి అలాంటి టీకా విధానాన్ని అమలు చేసినట్టు ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: