కరోనా విజృంభణ.. ఈ సారి జర్మనీ వంతు..!

Chandrasekhar Reddy
కరోనా దాదాపుగా తగ్గుముఖం పట్టింది అన్ని అందరు కాస్త సాధారణ జీవనం లోకి వచ్చేసరికే, మరోసారి ఈ వైరస్ విజృంభణ ప్రారంభించింది. దీనితో అనేక దేశాలు మరోసారి కఠినమైన సందర్భాలు ఎదురుకొంటున్నారు. చైనా సహా పలు దేశాలలో లోక్ డౌన్ మళ్ళీ పెట్టాల్సి వచ్చింది అంటేనే ఈ వైరస్ ప్రభావం ఎంతగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఏది ఏమైనా ప్రజలు కరోనా కాస్త తగ్గింది అనగానే యాధస్థితికి రావడం తప్పు కాకపోయినా కనీస నిబంధనలు మాత్రం పాటించలేకపోతున్నారు. ఈ సమస్య కరోనా వ్యాప్తికి కారణం అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది. ఒక దేశంలో కరోనా పోయింది అనుకుని అందరు నిబంధనలు వదిలేస్తే, ప్రమాదం అని పూర్తిగా ఈ వైరస్ ప్రపంచం నుండి వెళ్ళిపోతేనే సంస్థ తీరినట్టు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
కాస్త కరోనా తగ్గింది అనగానే అప్పటి వరకు టీకా కోసం పరుగులు పెట్టిన వారు కూడా కాస్త వెనకడుగు వేయడం మొదలుపెట్టారు. అలాగే ఆయా ప్రభుత్వాలు కూడా టీకా పంపిణీలో అలసత్వాన్ని ప్రదర్శించడం కూడా ఈ విజృంభణకు కారణం కావచ్చు. ఏది ఏమైనా ఈ తరహా పనులు మళ్ళీ పుంజుకుంటేనే కరోనా నుండి తప్పించుకోవచ్చని స్పష్టం అవుతుంది. ఇప్పటికే రష్యా, బ్రిటన్, చైనా, జపాన్ లలో ఈ వైరస్ తన ప్రభావాన్ని చూపించడం ప్రారంభించింది. భారత్ లో కూడా పండుగ సీజన్ తరువాత విజృంభించాల్సింది కానీ, స్వయంగా ప్రధాని దానిపై సమీక్షలు నిర్వహిస్తుండటంతో కాస్త పరవాలేదని చెప్పాలి.
జర్మనీలో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. అక్కడ ఈ వైరస్ హఠాత్తుగా తీవ్రతరం కావడంతో ఎక్కడ చూసినా ఆసుపత్రులలో కరోనా చికిత్స పొందుతున్న వారు ఎక్కువ అయిపోయారు. అసలు ఆసుపత్రులలో బెడ్స్ సరిపోని స్థితి వచ్చేసింది. డెల్టా వేరియంట్ వ్యాప్తి కావడంతో అది అతిత్వరగా వ్యాప్తి చెందుతూ ఎక్కువ మందిని వ్యాధిగ్రస్తులను చేస్తుంది. దీనితో వైరస్ ప్రభావం తో ఆసుపత్రులకు పరుగులు పెట్టె వారి సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇప్పటికే జర్మనీలో 67శాతం టీకాలు తీసుకున్నప్పటికీ పరిస్థితి ఈ విధంగా ఉన్నది. అందుకే మళ్ళీ టీకా పంపిణీని ఉదృతం చేస్తుంది అక్కడి ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: