త‌క్కువ నిద్ర‌పోయే వాళ్ల‌కు పెద్ద షాకింగ్ న్యూస్‌..!

VUYYURU SUBHASH
సాధారణంగా మ‌నిషికి ఆక‌లి , ద‌ప్పిక తో పాటు స‌రైన నిద్ర కూడా అవ‌స‌రం.  మనిషి హెల్తీగా ఉండటానికి ప్రశాంత మైన నిద్ర చాలా అవసరం. నిద్ర అనేది మ‌నిషి యొక్క ఆయుష్షును పెంచుతుంది. సరైన నిద్రలేకపోవడం వల్ల మ‌నిషికి చాలా అన‌ర్థాలు క‌లుగుతాయ‌ట‌. దీనిపై తాజాగా అమెరికాలోని పెన్సిల్వేనియా వర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన  ప‌రిశోధ‌న‌ల్లో షాకింగ్ విష‌యాలు వెల్ల‌డి అయ్యాయి. మ‌నిషికి కావాల్సినంత నిద్ర లేక‌పోతే ఆ ప్ర‌భావం మ‌నిషి శ‌రీరం లో కీల‌క పార్టుల‌పై చాలా ఎక్కువుగా ప‌డుతుంద‌ట‌. ముఖ్యంగా మెదడుపై ప్రత్యక్ష ప్రభావం పడుతుందని ఈ శాస్త్ర‌వేత్త‌లు నిర్ధారించారు.

నిద్ర లేక‌పోవ‌డం వ‌ల్ల మ‌నిషి గ్ర‌హించే శ‌క్తి తో పాటు ఆలోచన శక్తి... అర్థం చేసుకునే సామర్థ్యం చాలా వ‌ర‌కు త‌గ్గిపోతాయ‌ట‌. స‌గ‌టున  మ‌నిషి ప్రతిరోజు 7.30 గంటలకు తక్కువ కాకుండా నిద్రపోవడం చాలా ఉత్త‌మం అట‌. అదే వ‌య‌స్సు పై బ‌డిన వారు అయితే క‌నీసం రోజుకు 8 గంట‌లు ..ప‌డుకుంటే మంచిది అని చెపుతున్నారు. ఇక తీవ్ర‌మైన  నిద్ర లేమీ  వ‌ల్ల భ‌యంక‌ర‌మైన  వ్యాధులు వ‌స్తాయ‌ట‌.

వీరి అధ్య‌య‌నంలో 15 మంది యువకులను పదిరోజుల పాటు రోజు 5 గంటలకు మించి నిద్ర పోకుండా చేశారు. దీంతో వారి శ‌రీరంలో గ్లూకోజ్ కొవ్వు పదార్థాల స్థాయి పెర‌గ‌డంతో పాటు వారి జీవ‌క్రియ‌ల రేటు కూడా ఒక్క సారిగా హెచ్చు త‌గ్గులు  వ‌చ్చాయ‌ట‌. దీనిని బ‌ట్టి నిద్ర లేమి వ‌ల్ల జీవ‌క్రియ రేటు దెబ్బ తిన‌డ‌తో పాటు షుగ‌ర్‌, స్థూల‌కాయ స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయంటున్నారు.

ఏదేమైనా రోజు రాత్రి 7 - 8 గంట‌ల పాటు ప‌డుకుంటే మంచి  ఆరోగ్యం ఉంటుంద‌ట‌..  అప్పుడు అనారోగ్య స‌మ‌స్య‌లు  వ‌చ్చే అవ‌కాశం చాలా త‌క్కువుగా ఉంటుంద‌ట‌. సో దీనిని బ‌ట్టి నిద్ర లేమి వ‌ల్ల మ‌నిషికి చాలా స‌మ‌స్య‌లు రావ‌డంతో పాటు ఆలోచ‌నా శ‌క్తి కూడా త‌క్కువ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: