బ్రిటన్ లో కొత్త వేరియంట్.. వేగంగా వ్యాప్తి..!

Chandrasekhar Reddy
బ్రిటన్ లో మరో సరికొత్త వేరియంట్ బయటపడింది. ఇది డెల్టా కంటే వేగంగా విస్తరిస్తున్నట్టు అక్కడి వైద్య శాఖ తెలిపింది. ఈ కొత్త వేరియంట్ అతివేగంగా విస్తరిస్తుండటంతో, బ్రిటన్ లో కరోనా  కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. దీనికి డెల్టా ప్లస్ గా నామకరణం చేశారు. ఈ వేరియంట్ ను పరిశీలిస్తున్నట్టుగా అక్కడి వైద్య శాఖ తెలిపింది. ఇది అత్యంత వేగంగా వ్యాప్తిస్తున్నట్టు వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. అయినా తీవ్రత మాత్రం డెల్టా కంటే తక్కువగానే ఉందని వాళ్ళు తెలిపారు. వాతావర్ణా మార్పులతో ప్రజలలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవడం వలన ఈ తరహా వ్యాప్తి జరుగుతుందా లేక నిజంగా కొత్త వేరియంట్ ప్రమాదకరంగా వ్యాప్తిస్తున్నదా అనేది అధ్యయనం చేయాల్సి ఉంది.
ఇప్పటికి మాత్రం కొత్త వేరియంట్ వ్యాప్తి దాదాపుగా 6 శాతం ఉంది. అంటే ఒక్క రోజులో 15120 కేసులు డెల్టా ప్లస్ వారే ఉంటున్నారు. దీనితో ఆయా ప్రాంతాలలో కరోనా నిబంధనలను కఠినతరం చేశారు. అవసరమైన చోట లాక్ డౌన్ కూడా విధించేందుకు సిద్ధం అయ్యారు. బహిరంగ ప్రదేశాలలో వచ్చిన వారికి సరైన పత్రాలు చూపించాలని, లేదంటే శిక్షలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కేవలం వాక్సిన్ తీసుకున్న వారు మాత్రమే, అది కూడా కరోనా నిబంధనలు పాటిస్తూ తమ నిత్యావసరాలను కొనుగోలు చేసుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే, కఠిన శిక్షలు తప్పవని, ప్రజలు పరిస్థితులను అర్ధం చేసుకొని సహకరించాలని అక్కడి ప్రభుత్వం తెలిపింది.
మరోపక్క ఆస్ట్రేలియాలో కూడా ఇదే తరహాలో కరోనా విజృంభిస్తుంది. అందుకే ప్రస్తుతం వాక్సిన్ తీసుకున్న వారికి తప్ప ఎవరికి బయటకు అనుమతి ఇవ్వడం లేదు. ఇంకా టీకా తీసుకోని వారికి మాత్రం కఠినమైన ఆంక్షలు కొనసాగిస్తున్నారు. ఇక రష్యా లో కూడా ఒక్క రోజులో 37678 కేసులు నమోదు అవుతున్నాయి. వెయ్యికి పైగానే మృతులు ఉంటున్నారు. పోయిన సెప్టెంబర్ తో పోలిస్తే, కేసులు 70 శాతం పెరగ్గా, మరణాలు కూడా 33 శాతం పెరిగాయి. ఉక్రెయిన్ లోను రికార్డు స్థాయిలో మృత్యువాత పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: