కొత్త వేరియంట్ లకు.. కోవిషిల్డ్ భేష్.. !

Chandrasekhar Reddy
భారత్ లో స్వయం సమృద్ధి లో భాగంగా కరోనా వాక్సిన్ తయారీ ప్రారంభం అయ్యింది. దానిని కేవలం భారత్ లోనే కాకుండా ఇతర దేశాలకు కూడా ఉచితంగా వితరణ జరిగింది. ప్రధాని స్వయగంగా ఈ పర్యవేక్షణ చేసిన విషయం అప్పట్లో మనం చూశాం. లాక్ డౌన్ సమయంలో ప్రపంచంలోని ప్రతి దేశానికి మరోదేశంతో అన్నిరకాల సంబంధబాంధవ్యాలు తెంచుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఎక్కువగా దిగుమతులపై ఆధారపడిన దేశాలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డాయి. దానిని దృష్టిలో ఉంచుకొని భారత్ లో స్వయంసమృద్ది క్రింద దేశంలోనే ఆయా ఉత్పత్తులు చేసుకునే ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. అందులో ప్రధానంగా మొదటి మెట్టుగా వైరస్ టీకా ను ఉత్పత్తి చేయడం జరిగింది. ఒకపక్క భారత్ లో ని పౌరులకు అందిస్తూనే మరోపక్క అత్యవసరం ఉన్న ఇతర దేశాలకు కూడా పంపిణి చేయగలిగింది భారత్. అప్పటికి ఆశించినంత ఉత్పత్తి సామర్థ్యం లేకపోవటం చేత అందరికి అందించడానికి వీలుపడలేదు కానీ, తరువాత ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకుంది.
ఇప్పుడు మళ్ళీ భారత వాక్సిన్ ను ఆయా దేశాలకు ఎగుమతి చేస్తుంది. దేశంలో కూడా ఇప్పటికే వంద కోట్ల వాక్సిన్ లను పంపిణి చేసి, ఆ విజయంపట్ల ఆనందాన్ని ప్రధాని తన ప్రజలతో పంచుకున్నారు కూడా. వాక్సిన్ ఉత్పత్తి ని బట్టి, ప్రమాదానికి బాగా దగ్గరగా ఉన్నవారికి ముందు కేటాయించారు. అంటే వైద్య రంగంలో ఉన్నవారిని, ఇతర ఫ్రంట్ లోనే కార్మికులకు, అలాగే 45 ఏళ్ళ వయసువారికి ప్రధానంగా వాక్సినేషన్ చేయడం జరిగింది. అనంతరం 18 ఏళ్ళు దాటిన వారికీ కూడా పంపిణి జరుగుతూనే ఉంది. అతి కొద్ది కాలంలో పిల్లలకు కూడా వాక్సినేషన్ ప్రారంభించనున్నట్టు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
 
తాజాగా భారత్ లో తయారైన వాక్సిన్ ల ప్రభావం కొత్త వేరియంట్ల పట్ల ఆశాజనకంగా ఉందని వివిధ అధ్యయనాలతో తేల్చారు. ముఖంగా కోవిషిల్డ్ డెల్టా లాంటి వేరియంట్లపై 90శాతం ప్రభావవంతంగా ఉన్నట్టు ఈ నివేదికలు వెల్లడించాయి. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ దాదాపు 54 లక్షల మందికి పైగా డేటాను పరీక్షించి ఈ నివేదికలు తయారు చేశారు. ఈ సమయంలో 115000మంది కరోనా వైరస్ బారిన పడగా, 201 మంది మృతి చెందారు. వైరస్ బాధితులను ప్రాణాపాయం లేకుండా కాపాడటంలో ఈ టీకాలు బాగా పనిచేస్తున్నట్టు వెల్లడైంది. ఈ అధ్యయనం స్కాట్లాండ్ లో ఈవ్-2 అనే సంస్థ నిర్వహించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: