పంది కిడ్నీ మ‌నిషికి పెట్టిన డాక్ట‌ర్లు..!

Paloji Vinay
వైద్య‌రంగంలో మ‌రో అద్భుతం జ‌రిగింది. అవ‌య‌వ మార్ప‌డిలో మ‌రో స‌రికొత్త అధ్య‌యానికి ముందడుగు ప‌డింది. కిడ్నీ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారికి శుభవార్త చెప్పారు అమెరికా డాక్ట‌ర్లు. కిడ్నీ మార్పిడి ప్ర‌క్రియ‌లో వినూత్న ప్ర‌యోగం చేసి విజయం సాధించారు. ప్ర‌పంచంలోనే మొద‌టి సారి చేసిన వారి ప్ర‌య‌త్నం సక్సెస్ అయింది. కిడ్నీల కొర‌త‌తో కిడ్ని మార్పిడి ఆల‌స్యం అవుతున్న రోగుల‌కు అమెరికా డాక్ట‌ర్లు చేసిన ప్ర‌యోగం ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంది.

  పంది కిడ్నీ మ‌నిషికి అమ‌ర్చిన ఆ డాక్ట‌ర్ల ప్ర‌తిభ‌ను పొగ‌డాల్సిందే. నేటి ప‌రిస్థితుల్లో అవ‌యవ మార్పిడి సర్వ‌సాధార‌ణం అయింది. కానీ, అవ‌య‌వాల కొర‌త‌తో ఇబ్బందిగా మారింది. ఇందుకు ప‌రిష్కారం క‌నుకున్నే దిశ‌గా శాస్త్ర‌వేత్త‌లు చాలా కాలంగా ప్ర‌యోగాలు చేస్తూనే ఉన్నారు. జంతువుల అవ‌య‌వాల‌ను మ‌నుషుల‌కు అమ‌ర్చే అంశంపై  నిరంత‌ర ప్ర‌యోగాలు జ‌రుగుతున్నాయి. ఇందులో భాగంగానే న్యూయార్క్‌లోని ఎన్ వోయూ లాంగాన్ హెల్త్ సెంట‌ర్‌కు చెందిన శాస్త్ర‌వేత్త‌లు స‌రికొత్త ప్ర‌యోగం చేశారు.


 ప్ర‌పంచంలోనే మొట్ట‌మొద‌టి సారి పంది కిడ్నీని మ‌నిషికి అమ‌ర్చారు. జ‌న్యు స‌వ‌ర‌ణ చేసిన పంది నుంచి మూత్ర‌పిండాల‌ను సేక‌రించి మ‌నిషికి అమ‌ర్చారు. ఇది స‌త్ఫ‌లితాల‌నిచ్చింది.  పంది మూత్ర‌పిండం మాన‌వుని శ‌రీరంలో ఎలాంటి ప్ర‌తికూల ప‌రిస్తితి క‌లిగించ‌లేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది మూత్ర‌పిండాల వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. ల‌క్ష‌ల మందికి కిడ్నీ మార్పిడులు అవ‌స‌రం. కానీ, అవ‌స‌ర‌మ‌యిన‌న్ని కిడ్నీలు లేక చికిత్స ఆల‌స్య‌మ‌వుతున్నాయి. ఫ‌లితంగా చాలా మంది చ‌నిపోతున్నారు.

  ఇప్పుడు అమెరికా డాక్ట‌ర్లు చేసిన వినూత్న ప్ర‌యోగంతో కిడ్నీ వ్యాధి బాధితుల్లో కొత్త వెలుగు నిండే అవ‌కాశం ఉంది. బ్రెయిన్ డెడ్ అయిన మ‌హొళ‌కు జ‌న్యు మార్పిడి చేసిన పంది కిడ్నీని అమ‌ర్చారు. మూడు రోజులు ప‌రిశీలించారు. మ‌నిషి కిడ్నీ లాగే పంది కిడ్ని ప‌ని చేస్తుంద‌ని శ‌స్త్ర‌చికిత్స‌కు నేతృత్వం వ‌హించిన స‌ర్జ‌న్ తెలిపారు. రానున్న కాలంలో కిడ్నీ రోగుల‌కు ఇది సంజీవ‌నిలా ప‌ని చేస్తుంద‌ని వారు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: