మనిషికి.. జంతువుల కిడ్నీ..!

Chandrasekhar Reddy
మనుషులకు ఆయుప్రమాణం పెంచేందుకు నిరంతరం వైద్యశాస్త్రవేత్తలు కృషి చేస్తూనే ఉన్నారు. కొన్ని సార్లు సరైన అవయవాలు లేక మరణిస్తున్న మనిషిని బ్రతికించేందుకు ఆయా అవయవాలను కృత్రిమంగా కూడా సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో నిరంతర కృషి జరుగుతూనే ఉంది. వీలైతే మనిషికి ఒక అవయవాన్ని లేదా పూర్తిగా ప్రతి అవయవాన్ని ఎప్పుడు అయినా మార్చే విధంగా, అంటే దాదాపు మనిషి అవయవాలు పాడైపోవడం వలన మృత్యువాత పడకుండా అనేక ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే అనేక ప్రయోగాలు ఆయా దేశాలలో జరుగుతూనే ఉన్నాయి. మనిషిని బ్రతికించడానికి వైద్యుడు నిరంతరం తాపత్రయం పడుతూనే ఉన్నాడు. అయితే ఎక్కడో కొందరు ఇందుకు బిన్నంగా కూడా లేకపోలేదు, వారిని పక్కన పెడితే, మిగిలిన వారందరు ఈ ప్రయత్నాలను ప్రోత్సహించడంలో ముందుంటారు.
అలాగే మనిషి సహజంగా ఒక జంతువు నుండి ఆవిర్భవించాడు అంటున్నారు కాబట్టి ఆ జంతువు అవయవాలు మనిషికి సరిపోతాయా అనేది కూడా ఆలోచించారు ఈ శాస్త్రవేత్తలు. అలాంటివి ప్రయోగాత్మకంగా చేసినప్పటికీ పెద్దగా అంటే అతికొద్ది కాలం మాత్రమే ప్రయోజనం కలిగింది. అలా కాకుండా సాధారణ మనిషి అవయువం మాదిరి మార్పిడి జరిగిన తరువాత కూడా పనిచేసే విధంగా ఉండాలన్నది వారి లక్ష్యం. దానికోసం ఇటీవల ఒక మనిషికి పంది కిడ్నీ ని అమర్చారు. దీనివలన అతడి ప్రాణం నిలబడింది కానీ, అది ఎన్నాళ్ళు అలా ఉపయోగపడుతుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. పందిలో కూడా మానవ శరీర నిర్మాణం తరహాలో కొవ్వును పలచగా చేసే ఏర్పాటు ఉండటం చేత ఈ ప్రయోగం ఫలిస్తుందని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అయితే జంతువుల అవయవాలను మానవులకు అమర్చడం పదిహేడవ శతాబ్దంలోనే ప్రారంభం అయినప్పటికీ, ఇప్పుడిప్పుడే అది మళ్ళీ ఆవశ్యకతమని అర్ధం అవుతుంది. అందుకే కొందరికి ఇలాంటి ప్రయోగాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా ఇందులో కూడా చైనా ఒక అడుగు ముందే ఉంది. అవయవాలు పాడైపోయిన వారికి ఆయా జంతువుల భాగాలతో మార్పిడి చేసి ప్రాణాలను రక్షిస్తున్నారు అక్కడి వైద్యులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: