బాదంను ఎందుకు నానబెట్టి తింటారో తెలుసా ?

Vimalatha
బాదం పప్పును నానబెట్టకుండా తింటే ఎలాంటి హాని జరగదు. కానీ చాలా మంది నానబెట్టిన బాదం పప్పును, తొక్క తీసి తింటూ ఉంటారు. కానీ నానబెట్టిన బాదం నిజంగా మంచిదేనా? అంటే సాధారణ బాదం కన్నా నానబెట్టిన బాదం పప్పు మంచిది. బాదం పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, ప్రోటీన్, విటమిన్ ఇ, మెగ్నీషియం, మాంగనీస్, రాగి, భాస్వరం వంటి పోషక విలువలకు అద్భుతమైన మూలం. ఈ పోషకాలన్నీ బరువు తగ్గడానికి, ఎముకల ఆరోగ్యానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి, గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగపడతాయి. బాదంతో పాటుగా వేరుశెనగ, వాల్‌నట్స్ వంటి నట్స్ తీసుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. బాదం శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ల స్థాయిని పెంచి, రక్తపోటును తగ్గిస్తుంది. వాటిని రాత్రిపూట నానబెట్టి తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.
నానబెట్టిన బాదం సులభంగా జీర్ణమవుతుంది. నానబెట్టిన వాటిని నమలడం సులభం, జీర్ణం కావడానికి చాలా మృదువుగా ఉంటుంది. నానబెట్టిన బాదంతో ఆరోగ్య ప్రయోజనాలు పెరుగుతాయి. బాదంపప్పును నానబెట్టడం వలన యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్ ప్రయోజనాలు మెరుగవుతాయి. నానబెట్టిన బాదం లిపేస్ వంటి ఎంజైమ్‌లను విడుదల చేస్తుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మనం బాదంపప్పును నానబెట్టనప్పుడు వాటిలో ఉండే ఫైటిక్ యాసిడ్ విడుదల అవుతుంది. ఇది పోషకాలను శరీరం గ్రహించడాన్ని అడ్డుకుంటుంది. అందువల్ల మామూలు బాదం తినడం ద్వారా వాటిలో ఉండే జింక్, ఐరన్ సరిగా అందవు. ఇలా నానబెట్టి తింటే వాటిలోని ఆరోగ్య ప్రయోజనాలు మరింతగా పెరుగుతాయి. అందుకే బాదం నానబెట్టి తినాలని పెద్దలు చెబుతూ ఉంటారు. బరువు తగ్గాలనుకునే వారు రోజూ వారి డైట్ లో బాదంను స్నాక్స్ లేదా ఎదో ఒక విధంగా తీసుకుంటే మంచిది. త్వరగా బరువు తగ్గొచ్చు. ఇలా బాదంను నానబెట్టి తినడం వెనుక చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: