థ‌ర్డ్ వేవ్ ముప్పు త‌గ్గ‌లేదా? ఇప్పుడు ఏం చేయాలి?

Dabbeda Mohan Babu
క‌రోనా వైర‌స్ చైనా లో పుట్టి ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌ను హ‌డ‌లెత్తిస్తుంది. ఈ వైర‌స్ వ‌ల్ల కోట్లాది మంది ఇబ్బందులు ప‌డుతున్నారు. అలాగే ఈ వైర‌స్ అనేక రకాలు గా మ‌రి ప్ర‌జ‌ల పై దండ యాత్ర చేస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా ర‌కాల క‌రోనా వైరెస్ మ్యూటెంట్ ల‌ను గుర్తించారు. క‌రోనా వైర‌స్ మ్యూటెంట్ ల‌ను మార‌స్తు ప్ర‌జల‌పై దాడి చేస్తుంది. ఈ కొత్త ర‌కం మ్యూటెంట్ ల వ‌ల్లే క‌రోనా వైర‌స్ నిర్ములించ‌డానికి వ్యాక్సిన్ లు అల‌స్యం అయ్యాయి. అలాగే వ్యాక్సిన్ వేసుకున్న వారి కి కూడా క‌రోనా వైర‌స్ సోకుతుంది. దీనికి కార‌ణం క‌రోనా వైర‌స్ తన మ్యూటెంట్ ల‌ను మార్చు కోవ‌డంమేన‌ని వైద్య శాస్త్ర వేత్త‌లు చెబుతున్నారు.


అలాగే ఈ మ‌ధ్య కాలంలోనే కరోన వైర‌స్ రెండో వేవ్ ను కూడా ప్ర‌పంచ ప్ర‌జ‌లు ఎదుర్కొన్నారు. అయితే క‌రోనా వైర‌స్ మూడో వేవ్ ప్ర‌మాదం త‌క్కువే అని ప‌లువురు శాస్త్రవేత్త‌లు అన్నారు. కాని మూడో వేవ్ ముప్పు తేప్పేట్టు లేద‌ని కొంత మంది శాస్త్రవేత్త‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ అనుమానాల‌కు అనుగూణం గా మ‌న దేశంలో కరోనా కేసులు కూడా తీవ్రం గా పెరుగుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో మ‌న దేశంలో దాదాపు 14 వేల‌కు పైగా కరోనా కేసులు వ‌చ్చాయి. దీనికి తోడు గా అక్టోబ‌ర్‌, న‌వంబ‌ర్, డిసెంబ‌ర్ నెల‌లో ఎక్కువ పండ‌గ‌లు ఉంటాయి కాబ‌ట్టి వైరస్ వ్యాప్తి ఎక్కువ గా ఉంటుంద‌ని శాస్త్రవేత్త‌లు హెచ్చ‌రిస్తున్నారు. కాబ‌ట్టి ఈ నెల‌లో వ‌చ్చే పండుగ ల‌ను నిరాడంబ‌రంగా చేసుకోవాల‌ని చెబుతున్నారు. ఏమాత్రం అజాగ్ర‌త్త గా ఉన్న వైర‌స్ కాటు బ‌లి కావ‌ల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. కాబ‌ట్టి ఈ పండుగ రోజుల్లో ఎక్కువ మంది ఆహ్వానించ‌కుండా, గుంపు గుంపు లుగా పోగు కాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. అలాగే బ‌య‌ట‌కు వెళ్లిన స‌మ‌యాల్లో మాస్క్ ల‌ను త‌ప్ప‌ని స‌రిగా వాడు కోవాలి, సానిటైజ‌ర్ ను కూడా వాడాలి అని వైద్యులు చెబుతున్నారు. అలాగే అంద‌రూ కూడా వ్యాక్సీన్ ల‌ను త‌ప్ప‌క వేసుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: