ఈ వ్యాయామాలతో ఎక్కువ కాలం ఫిట్ గా బ్రతకోచ్చు..

Purushottham Vinay
కొత్తగా వ్యాయామం స్టార్ట్ చేసేవారికి బర్డ్ డాగ్ వ్యాయామం చాలా మంచిది.దీనితో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇక ఈ ఎక్సర్‌సైజ్ చెయ్యడం వల్ల నడుము భాగం, తొడలు, ఆబ్స్ బాగా బలోపేతం అవుతాయి. ఇక కఠినమైన వ్యాయామం కంటే కూడా ఈ వ్యాయామం చాలా సులభమైంది. దీన్ని మన ఇంట్లో ఉండి కూడా చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఇక ప్రతి రోజూ కూడా ఈ ఎక్సర్‌సైజ్ చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు అనేవి కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇక అలాగే సైడ్ ప్లాంక్ ఎక్సర్‌సైజ్ చెయ్యండి. దీని ద్వారా బ్యాలెన్సింగ్ ఇంకా కంట్రోలింగ్ అనేది బాగా మెరుగుపడుతుంది.ఇక అంతేకాదు ఇది చెయ్యడం వల్ల పొట్ట చుట్టూ బాగా పేరుకుపోయిన కొవ్వు ఈజీగా కరిగిపోతుంది. ఇక అంతేగాక ఆబ్స్ కూడా బలోపేతం అవుతాయి.ఇక ఈ పొజీషన్‌లో కొన్ని సెకన్ల పాటు 2 నుంచి 3 సార్లు చేయడం ద్వారా ఆరోగ్యానికి మంచి ఫలితం అనేది ఉంటుంది.

ఇక బ్రిడ్జ్ ఎక్సర్‌సైజ్ ఆరోగ్యానికి చాలా మంచిది.ఇది చేయడం ద్వారా వెన్నెముక చాలా బలంగా అవుతుంది. ఇది బాడీకి మంచి స్ట్రెచింగ్‌గా కూడా పని చేస్తుంది. ఇక తరువాత చేసే వ్యాయామానికి శరీరం పూర్తి సన్నద్ధంగా ఉండేందుకు కూడా ఎంతగానో సహకరిస్తుంది. అలాగే రెక్టస్ అబ్డోమినిస్ ఇంకా క్వాడ్రిస్ప్‌లను కూడా స్థిరీకరిస్తుంది.

బ్యాండెడ్ లాటెరల్ వాక్ అనే ఈ వ్యాయామం మోకాళ్ల నొప్పులకి చాలా మంచిది. ఆ నొప్పుల నుండి ఈజీగా బయటపడటానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇక అదనంగా ఇది గ్లూటియస్ మీడియస్‌ని కూడా చాలా బాగా బలపరుస్తుంది.అలాగే మోకాలిపై పార్శ్వ ఒత్తిడిని తగ్గించడం ద్వారా కూడా మోకాలి కీలులో సరైన ట్రాకింగ్‌ను నిర్వహించడానికి తుంటిని ఈ వ్యాయామం బాగా స్థిరీకరిస్తుంది.

కాబట్టి ఈ రకమైన వ్యాయామాలు ప్రతి రోజు కూడా చెయ్యండి. ఎక్కువ కాలం ఫిట్ గా వుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

fit

సంబంధిత వార్తలు: