మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారణం ఏంటంటే..?

Purushottham Vinay
ఇండియాలో ప్రతి 8 మంది మహిళల్లో ఒకరు రొమ్ము క్యాన్సర్ తో బాధ పడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి.ఇక గ్రామీణ భారతదేశంలో కంటే కూడా నగరాల్లో ఈ వ్యాధి బాధితులు చాలా ఎక్కువ. రొమ్ము క్యాన్సర్ గురించి అనేక అపోహలతో కూడా అనుమానాలు చాలా ఉన్నాయి. టైట్ గా ఉండే బ్రా లేదా అండర్ వైర్ బ్రా వేసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని చాలా మంది కూడా నమ్ముతారు.ఇక అలాగే రాత్రిపూట బ్రా వేసుకొని నిద్రపోవడం కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశాలను మరింత పెంచుతుంది. ఇక రొమ్ము క్యాన్సర్ గురించి ఇలాంటి అపోహలు అనేవి చాలానే ఉన్నాయి. ఇక వాటికి సంబంధించిన నిజానిజాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.ఇక రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండటానికి బ్రా ధరించకూడదనే సలహా అసంబద్ధం. అండర్ వైర్ లేదా ఎలాంటి బ్రా అయినా వేసుకున్నా సరే రొమ్ము క్యాన్సర్ వచ్చే ఛాన్స్ లేదు.

అయితే, గట్టి లోదుస్తులు వేసుకోవడం వల్ల రొమ్ము శోషరస పారుదల ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అంతే కానీ,టైట్ బ్రా లేదా అండర్ వైర్ బ్రా వేసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని రుజువు చేయడానికి ఎలాంటి సైన్టిఫిక్ వాస్తవాలు లేవు.కాని మరీ టైట్ బ్రా వేసుకుంటే మాత్రం వచ్చే ఛాన్స్ వుంది.ఎందుకంటే కొంతమంది మహిళలు సైజ్ తెలీకుండా తప్పు బ్రా వేసుకుంటారు. ఇక తప్పు బ్రా వేసుకోవడం వల్ల వెన్ను లేదా మెడ నొప్పి మాత్రమే కాకుండా రొమ్ము క్యాన్సర్, గుండెల్లో మంట ఇంకా జీర్ణ సమస్యలు అలాగే చర్మంపై దద్దుర్లు ఇంకా తలనొప్పి కూడా రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.కాని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, పేదరికం ఇంకా అనియంత్రిత జీవనశైలి అనేవి రొమ్ము క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు.ఇక ఇది కాకుండా, రొమ్ము క్యాన్సర్ అనేది వ్యాధి జన్యుపరంగా వచ్చే అవకాశం కూడా ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: