డెంగ్యూ విజృంభణ... ప్రమాదకరమా ?

Vimalatha
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా డెంగ్యూ ఫీవర్ విజృంభిస్తోంది. డెంగ్యూ కేసులు రోజు రోజుకు శరవేగంగా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ఈ వ్యాధి గురించి తెలుసుకుని అప్రమత్తంగా ఉండడం, కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. డెంగ్యూ లక్షణాలను సరైన సమయంలో గుర్తిస్తే వైద్యంతో తగ్గించుకోవచ్చు. పరిస్థితులు చేయి దాటితే మాత్రం ప్రాణాల మీదకు వచ్చినట్టే.
ఈ సీజన్లో లో ప్రతి సంవత్సరం డెంగ్యూ కేసులు భారీగా నమోదవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. చాలామంది రోగులు తేలిక పాటి లక్షణాలతో బాధపడుతుంటారు. కొందరు ఒకటి లేదా రెండు వారాల్లో కోలుకుంటారు. మరికొందరిలో మాత్రం రోగి పరిస్థితి విషమంగా మారుతూ ఉంటుంది. ఈ సమయంలో నిర్లక్ష్యం చేస్తే రోగులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి డెంగ్యూ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోగులలో ఎక్కువగా అధిక జ్వరం, వాంతులు, విరేచనాల సమస్య కనిపిస్తోంది. అయితే అసలు డెంగ్యూ లక్షణాలు ఏంటి అనే విషయం చాలా మందికి తెలియదు.
డెంగ్యూ లక్షణాలు ఏమిటంటే?
అకస్మాత్తుగా చలిజ్వరం రావడం, తల నొప్పి, కీళ్ల నొప్పి, కండరాల నొప్పులు, కళ్ళ వెనుక నొప్పి, బలహీనంగా అనిపించడం, ఆకలి లేకపోవడం, వికారం. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుడిని సంప్రదించి డెంగ్యూ పరీక్షలు చేయించుకుని, వైద్యులు సూచించిన మందులను వాడడం మంచిది.
ఇంటి లోపల చుట్టు పక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. అలాగే కూలర్లు, విరిగిన పాత్రలు అలాంటి వాటిలో నీరు నిలిచి ఉండకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. కిటికీలు తలుపులు పై దోమ తెరలు వాడండి. వాటర్ ట్యాంక్, వంట, ఆహార పదార్థాలపై సరిగ్గా మూతలు వేయండి. దోమల నుండి రక్షణ పొందడానికి శరీరం మొత్తాన్ని కప్పి ఉంచే దుస్తులు ఎక్కువగా వాడండి. ఈ సమయంలో ఎప్పటికప్పుడు పండుకున్న ఆహారాన్ని తింటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: