మళ్లీ మళ్లీ మూత్రవిసర్జన... కారణాలు ఇవే కావచ్చు జాగ్రత్త !

Vimalatha
మళ్లీ మళ్లీ వాష్‌రూమ్‌కు వెళ్లాలనే కోరిక చాలా చికాకు కలిగిస్తుంది. ముఖ్యంగా మీరు ఏదైనా ముఖ్యమైన పని లేదా ప్రయాణం మధ్యలో ఉన్నప్పుడు అది చాలా ఇబ్బందులకు కారణం అవుతుంది. అయితే ఇలా తరచుగా మూతవిసర్జన అనేది ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
1. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI)
మూత్రపిండాలు, మూత్ర నాళాలు, మూత్రాశయం, మూత్ర నాళంలో ఇన్ఫెక్షన్ సోకితే దానిని యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటారు. దీనివల్ల తరచుగా మూత్ర విసర్జన చేయాలనే కోరిక, మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి, మంట, కడుపు నొప్పి లక్షణాలు. మూత్ర నాళం ఇన్ఫెక్షన్ అమ్మాయిలు, అబ్బాయిలు ఇలా ఎవరికైనా సోకుతుంది. ఇద్దరిలోనూ దాదాపు ఒకే లక్షణాలను కలిగిస్తుంది.
2. మధుమేహం
టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్ వల్ల కూడా తరచుగా మూత్రవిసర్జన జరగవచ్చు. అనియంత్రిత మధుమేహం అంటే శరీరంలో అధిక రక్తంలో చక్కెర స్థాయిలు ఉన్నప్పుడు మూత్రం రూపంలో మూత్రపిండాల నుండి ఎక్కువ ద్రవం విడుదల అవుతుంది. ఇది దాహం, ఆకలి పెరగడం, బరువు తగ్గడం, అలసట, దృష్టి సమస్యలు, మూడ్ మార్పులతో పాటు మరిన్ని సమస్యలకు దారి తీస్తుంది.
3. థైరాయిడ్
హైపర్ థైరాయిడిజం మూత్రపిండాల పని తీరును ప్రభావితం చేస్తుంది. అదే తరచుగా మూత్రవిసర్జనకు కారణమవుతుంది. ఇతర లక్షణాలు బరువు తగ్గడం, హార్ట్ బీట్ గట్టిగా కొట్టుకోవడం, నిద్రలేమి, జుట్టు రాలడం, తరచుగా ప్రేగు కదలికలు.
4. ప్రోస్టేట్ సమస్యలు
ప్రోస్టేట్ క్యాన్సర్ పురుషులను ప్రభావితం చేసే అత్యంత సాధారణ క్యాన్సర్లలో ఒకటి. పురుష పునరుత్పత్తి వ్యవస్థలో ఉన్న చిన్న గ్రంథి అయిన ప్రోస్టేట్ స్పెర్మ్‌ను పెంచే ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. అయితే అది ఎక్కువైతే ప్రోస్టేట్ తరచుగా మూత్రవిసర్జన, నొప్పి, మూత్ర విసర్జన సమయంలో మంట లేదా మూత్ర విసర్జన ఆగుతూ అవడం వంటి అనేక సమస్యలకు దారి తీస్తుంది.
5. స్ట్రోక్
స్ట్రోక్ తరచుగా మూత్రాశయ పని తీరును నియంత్రించే నరాలను దెబ్బ తీస్తుంది. నరాలు మూత్రాశయానికి సరైన సంకేతాలను పంపలేవు కాబట్టి తరచుగా మూత్రవిసర్జన, మూత్రం ఆపుకోలేకపోవడం, ఆకస్మికంగా మూత్ర విసర్జనకు కారణం కావచ్చు.
6. కిడ్నీ స్టోన్స్
కిడ్నీలో స్టోన్స్ పెరగడం వల్ల తరచుగా మూత్రవిసర్జన, కడుపు నొప్పి, ఇతర బాధాకరమైన అనుభూతులతో పాటు అసౌకర్యం కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: